NewsOrbit
సినిమా

`ల‌వ‌ర్స్ డే ఫేమ్` నూరిన్ టాలీవుడ్ ఎంట్రీ


మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన `ఒరు ఆదార్ ల‌వ్‌` చిత్రం రిలీజ్‌కి ముందు ప్రియా వారియ‌ర్‌కి ఎంత పేరు తీసుకొచ్చిందో, రిలీజ్ త‌ర్వాత నూరిన్‌కి అంత పేరు తీసుకువచ్చింది. ఈ చిత్రం తెలుగులో `ల‌వ‌ర్స్ డే` పేరుతో అనువాద‌మైన సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళంలో ఫుల్ బిజీ అయిన నూరిన్ తెలుగులో చేస్తున్న తొలి చిత్రం `ఉల్లాలా ఉల్లాలా`. సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాశ్ ద‌ర్శ‌క‌త్వంలో సుఖీభ‌వ మూవీస్ ప‌తాకంపై ఎ.గురురాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు స‌త్య‌ప్ర‌కాశ్ మాట్లాడుతూ “ఇదొక వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రం. రొమాంటిక్ ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్‌. ఈ సినిమాలో నూరిన్ పాత్ర చాలా కీల‌కం. ఆమె త‌న గ్లామ‌ర్‌తోనూ, పెర్ ఫార్మెన్స్ తోనూ క‌చ్చితంగా తెలుగు ప్రేక్ష‌క హృద‌యాల‌ను కొల్ల‌గొట్ట‌డం ఖాయం. `ఉల్లాలా ఉల్లాలా` రిలీజ్ త‌ర్వాత నూరిన్ తెలుగులో కూడా బిజీ హీరోయిన్ అవుతుంది. ఈ పాత్ర‌కు నూరిన్ అయితే బాగుంటుంద‌ని చెప్ప‌గానే, మా నిర్మాత గురురాజ్ వెంట‌నే ఆమెతో మాట్లాడి ఒప్పించారు. ఈ సినిమాలో క‌నిపించే పాత్ర‌లు… నిజ‌మైన‌వి కావు. వాళ్లు మ‌నుషులా అంటే దెయ్యాలు. దెయ్యాలా? అంటే మ‌నుషులు. దెయ్యాలా? మ‌నుషులా? అంటే ఎవ‌రూ కారు. మా చిత్రంలో ఉన్న‌ది లేదు… లేనిదే ఉన్న‌ట్టు“ అని చెప్పారు.
నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ “మా బేన‌ర్‌లో `ర‌క్ష‌క‌భ‌టుడు`, `ఆనందం మ‌ళ్లీ మొద‌లైంది`, `ల‌వ‌ర్స్ డే` చిత్రాల త‌ర్వాత వ‌స్తున్న సినిమా `ఉల్లాలా ఉల్లాలా`. ఇలాంటి కాన్సెప్ట్ లు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. స‌త్య‌ప్ర‌కాశ్‌కి న‌టునిగా ఎంత పేరుందో, ద‌ర్శ‌కునిగా అంత‌క‌న్నా ఎక్కువ పేరు ఈ చిత్రం ద్వారా వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను“ అని తెలిపారు.
క‌థానాయిక నూరిన్ మాట్లాడుతూ “తెలుగులో నాకు చాలా అవ‌కాశాలు వ‌చ్చినా, ఈ క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశాను. నా పాత్ర క్లాస్‌కు, మాస్‌కూ న‌చ్చుతుంది. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను“ అని చెప్పారు.

author avatar
Siva Prasad

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Leave a Comment