వెంకీ న‌మ్మ‌క‌మేంటో?


సాధార‌ణంగా హీరోలు స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్స్‌తోనే సినిమాలు చేయాల‌నుకుంటారు. కానీ కొంద‌రు మాత్ర‌మే జ‌యాప‌జ‌యాల‌కు భిన్నంగా డైరెక్ట‌ర్స్‌ను ఎంచుకుంటారు. వారిలో వెంక‌టేశ్ ఒక‌రు. ఈయ‌న త్వ‌ర‌లోనే `వెంకీమామ‌`గా అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే త‌దుప‌రి చిత్రానికి ఆయ‌న స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. త‌మిళంలో హిట్ అయిన `అసుర‌న్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నట్లు నిర్మాత‌లు క‌లైపులి థాను, డి.సురేశ్‌బాబు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను ఓంకార్ డైరెక్ట్ చేస్తాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. హార‌ర్ కామెడీ చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్‌ను సాధించిన రాజుగారిగ‌ది ఫ్రాంచైజీలో మూడు చిత్రాలు వ‌చ్చాయి. అందులో తొలి భాగం మాత్ర‌మే విజ‌యాన్ని సాధించింది. రెండు భాగాలు బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశను మిగిల్చాయి. ఇలాంటి త‌రుణంలో ఓంకార్‌తో వెంక‌టేశ్ సినిమా చేయ‌డం వెనుక ఆయ‌న న‌మ్మ‌క‌మేంటో ఆయ‌న‌కే తెలియాలి.