Aishwarya Rai : సాధారణంగా ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనే విషయం మనకు తెలిసిందే. కేవలం ఈ విషయాన్ని వినడమే తప్ప ఇంతవరకు ఒకే పోలికలతో ఉన్నటువంటి ఏడుగురు వ్యక్తులను చూడలేదు. అయితే మనిషిని పోలిన మరొక మనిషిని సర్వసాధారణంగా చూసి ఉంటాం. ఈ తరహాలోనే సినీ సెలబ్రిటీలు పోలికలతో ఎంతో మంది ఉన్నట్లు ఇది వరకు మనం తెలుసుకున్నాము. అయితే మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఐశ్వర్యరాయ్ పోలికలతో ఇదివరకే స్నేహ ఉల్లాల్ ఉంటారని ఎన్నోసార్లు ఎంతోమంది తెలియజేశారు. అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ పోలికలతో అచ్చం జిరాక్స్ కాపీ లాగా ఉన్న ఓ అందగత్తె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో ఐశ్వర రాయ్ బ్రేకప్ తర్వాత స్నేహా ఉల్లాల్ అచ్చం ఐశ్వర్యారాయ్ పోలికలతో తెరపై సందడి చేశారు. బాలీవుడ్ లో మాత్రమే కాకుండా పలు దక్షిణాది చిత్రాలలో కూడా స్నేహ ఉల్లాల్ నటించారు. అయితే ఐశ్వర్య రాయ్ పోలికలతో స్నేహఉల్లాల్ మాత్రమే కాకుండా మరొక నటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు అంటే…
ప్రపంచ సుందరితో పోల్చడం ఎంతో ఆనందంగా ఉంది:
తాజాగా పాకిస్థాన్‌కు చెందిన బ్లాగర్ అమ్నా ఇమ్రాన్ ఐశ్వర్య రాయ్ పోలికలను కలిగి ఉండటమే కాకుండా అచ్చం ఐశ్వర్యకు అచ్చుగుద్దినట్టు, జిరాక్స్ కాపీ లాగా ఉండడంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్నా ఇమ్రాన్‌ను చూసిన వారంతా ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ మాదిరిగా ఉన్నావంటూ కామెంట్ చేయగా అమ్నా ఇమ్రాన్ తనను ఏకంగా ప్రపంచసుందరితో పోల్చడంతో ఆనందంతో గాల్లో తేలిపోతోంది. గతంలో కూడా ఎంతో మంది టిక్ టాక్ స్టార్లు ఐశ్వర్యరాయ్ పోలికలతో ఉన్నారనే వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం భారత జాతీయ మీడియాలో మాత్రం అమ్నా ఇమ్రాన్ హాట్ టాపిక్ గా మారింది.