సినిమా

Sarkaru Vaari Paata: మ‌హేశ్ మూవీలో జ‌గ‌న్ డైలాగ్‌.. అందుకే పెట్టాన‌న్న డైరెక్ట‌ర్‌!

Share

Tollywood, Hyderabad : టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తొలిసారి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. (SVP) ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వహించగా.. త‌మ‌న్ ఈ మూవీకి స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 12న విడుద‌ల కాబోతోంది.

రిలీజ్‌కు ఇంకా వారం రోజులే ఉండ‌టంతో.. పరశురామ్ అండ్ టీమ్ బోలెడంత జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నాడు. నేడు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. `నేను విన్నాను.. నేను ఉన్నాను`అంటూ తన పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందుకున్న ఈ నినాదం ప్రజల్లోకి ఎంతో బలంగా వెళ్లింది.

అయితే ఇదే డైలాగ్‌ను స‌ర్కారు వారి పాట‌లో వాడేశాడు. మొన్నీ విడుద‌లైన ట్రైల‌ర్‌లో మ‌హేశ్ ఈ డైలాగ్‌ను త‌న‌దైన శైలిలో ప‌లికించారు. మ‌హేశ్ నోట జ‌గ‌న్ డైలాగ్ రావ‌డంతో.. నెట్టింట ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. జగన్‌కు మ‌హేశ్ మద్దతుగా చెప్పిన డైలాగ్ అని కొందరు పోస్టులు పెడితే.. మరికొందరు ఇది వైఎస్ జగన్‌పై సెటైర్ అని పోస్టులు చేస్తున్నారు. అయితే ఈ విష‌యంపై తాజాగా డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ స్పందించాడు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న‌.. `నాకు దివంగత నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంటే ఎంతో అభిమానం. ఆయ‌న నుంచే `నేను విన్నాను. నేను ఉన్నాను` డైలాగ్ వ‌చ్చింది.ఆయన పాదయాత్ర సమయంలో, తరచూ ఈ మాటలు వాడేవారు. ఆ డైలాగ్‌లో చాలా అర్థం ఉంది. ఎంత పెద్ద భావాన్ని.. ఇంత చిన్న ముక్క‌లో భ‌లే చెప్పారు అనిపించింది. అలాంటి సంద‌ర్భం స‌ర్కారు వారి పాట‌లో ఒక‌టి ఉంటుంది. అందుకే ఆ డైలాగ్ పెట్టాను. స్క్రిప్టు రాస్తున్న‌ప్పుడే ఈ డైలాగ్ ఉంది. మ‌హేష్ కూడా ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. ఎలాంటి డిస్క‌ర్ష‌న్ లేకుండా.. సెట్లో ఈ డైలాగ్ ఓకే అయిపోయింది` అని చెప్పుకొచ్చారు.


Share

Related posts

రాజమౌళి కంటే ముందే ఆ సంచలన ప్రాజెక్ట్ పై కన్నేసిన త్రివిక్రమ్..??

sekhar

ఫైనల్ గా అలిమేలుమంగ ని ఫిక్స్ చేసిన తేజ్ ..గోపీచంద్ కి బ్లాక్ బస్టర్ అంతే ..?

GRK

జబర్దస్త్ ఇమాన్యుయల్ స్కిట్ల పేరుతో అమ్మాయిలను ఏం చేస్తున్నాడో చూడండి…! 

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar