Pawan Unstoppable: “అన్ స్టాపబుల్” టాకీ షో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రస్తుతం సెకండ్ సీజన్ కొనసాగుతోంది. దాదాపు చివరి దశకు చేరుకుంది. మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. రాజకీయ నాయకులతో పాటు బడాబడా సినీ సెలబ్రిటీలు రావడం జరిగింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కూడా ఈ షో కి రావడం తెలిసిందే. పవన్ ఎపిసోడ్ షూటింగ్ డిసెంబర్ నెలలోనే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం చేయటానికి ఆహా రెడీ అయింది. దీనిలో భాగంగా మొదటి పార్ట్ ఎపిసోడ్ ఫిబ్రవరి 3వ తారీఖు నాడు ప్రసారం చేస్తున్నట్లు… లేటెస్ట్ ప్రోమో ద్వారా స్పష్టం చేయడం జరిగింది.

ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మరియు సినిమా ఇంకా రాజకీయ జీవితంపై బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని విమర్శించాలి అని ప్రత్యర్థి రాజకీయ నాయకులు అనుకున్న సమయంలో ఎక్కువగా మూడు పెళ్లిళ్లు గురించి విమర్శలు చేయడం తెలిసిందే. దీంతో బాలకృష్ణ మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించడం జరిగింది. అంతేకాదు గుడుంబా శంకర్ సినిమాలో ఫాంట్ ఇంకా డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి కుటుంబం గురించి చాలా ప్రశ్నలు ప్రోమోలో వేశారు. ఇక ఇదే సమయంలో మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొనడం జరిగింది. పంచ కట్టుకొని.. రావటంతో పెళ్లికళ వచ్చేసింది అన్న తరహాలో సాయి ధరమ్ తేజ్ పై బాలయ్య సెటైర్లు వేశారు.

అంతేకాదు రామ్ చరణ్ తో బాలకృష్ణ ఫోన్ లో సంభాషించారు. ఈ క్రమంలో ప్రభాస్ ఎపిసోడ్ గురించి చర్చించి అతడి గుడ్ న్యూస్ అంటూ అప్పుడు మాట్లాడుతూ సైలెంట్ గా నీ గుడ్ న్యూస్ దాచేసావు అంటూ తండ్రి కాబోయే విషయాన్ని ప్రస్తావిస్తూ చరణ్ తో సరదాగా మాట్లాడారు. ఇంకా ఇదే ప్రోమోలో చిరంజీవి పిల్లల పెంపకం గురించి ఆసక్తికరమైన విషయాలు పవన్ ని బాలకృష్ణ వేయడం జరిగింది. మొదటి పార్ట్ ప్రోమోలో చాలా ఆహ్లాదకరంగా బాలకృష్ణ తనదైన శైలిలో పవన్ నీ ప్రశ్నించారు.