సినిమా

Pooja Hegde: చీర‌లో పూజా ఇంత అందంగా ఉందేంటి..చూపు తిప్పుకోవ‌డం కూడా క‌ష్ట‌మే!

Share

Pooja Hegde: టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాగ‌చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన `ఒక లైలా కోసం` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అల్లు అర్జున్ స‌ర‌స‌న `దువ్వాడ జగన్నాథం` చేసి తొలి హిట్‌ను ఖాతాలో వేసుకుంది.

ఆ త‌ర్వాత ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేస్తూ స్టార్ హోదాను అందుకున్న పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తోంది. అయితే వ‌రుస హిట్స్‌తో బ్రేకులు లేని బుల్డోజర్ లా దూసుకుపోతున్న పూజాకు.. రాధేశ్యామ్ రూపంలో బిగ్ ఫ్లాప్ ప‌డింది.

ఆ వెంట‌నే విడుద‌లైన త‌మిళ చిత్రం `బీస్ట్‌` కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది. దీంతో ఈ రెండు ఫ్లాప్స్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు పూజా హెగ్డే `ఆచార్య‌`పై ఆశ‌ల‌న్నీ పెట్టేసుకుంది. ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్‌లో ఆమె రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా న‌టించిది.

ఏప్రిల్ 29న ఈ సినిమా రిలీజ్ కాబోతుండ‌గా.. పూజా టీమ్‌తో క‌లిసి జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా పూజా రెడ్ క‌ల‌ర్ చీర‌ను క‌ట్టుకుని ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన‌గా.. అక్క‌డ కెమెరామెన్స్ ఆమె ఫొటోల‌ను క్లిక్ మ‌నిపించారు.

దీంతో ఇప్పుడీమె పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారగా.. వాటిని చూసి నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. కొంద‌రైతే వామ్మో, చీర‌లో పూజా ఇంత అందంగా ఉన్నావేంటి..చూపు తిప్పుకోవ‌డం కూడా క‌ష్టంగానే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి ఇంత‌కీ పూజా ఆచార్య‌తో అయినా మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కుతుందో..లేదో.. చూడాలి.


Share

Related posts

2 కోట్లు ఉంటేనే రండి అంటున్న హీరోయిన్…??

sekhar

సినిమా ధియేటర్లు ఓపెన్ అయితే ఫస్ట్ రిలీజ్ అయ్యే హీరో సినిమా ఇదే..!!

sekhar

19 ఏళ్ళకే రవితేజ హీరోయిన్ ఇన్ని చేసేసిందా…?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar