29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Prabhas: బాలీవుడ్ హీరోయిన్ తో నిశ్చితార్థం వార్తలపై ప్రభాస్ క్లారిటీ..!!

Share

Prabhas: తెలుగు చలనచిత్ర రంగంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సంగతి తెలుసు. ప్రభాస్ పెళ్లి కి సంబంధించి అనేక వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. అనుష్కతో పెళ్లి అని రకరకాల ప్రచారాలు జరిగాయి. అదేవిధంగా ప్రభాస్ కుటుంబం సైతం పెళ్లి విషయంలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రభాస్ కీ నిశ్చితార్థం జరగనున్నట్లు.. సరికొత్త ప్రచారం జరుగుతూ ఉంది.

Prabhas clarity on the news of engagement with Bollywood heroine

వచ్చేవారం మాల్దీవ్స్ లో ఈ శుభకార్యం.. జరగనుందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అంతకుముందే కృతి సనన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరగగా అప్పుడు… కృతి వార్తలను ఖండించడం జరిగింది. ఇదే ప్రస్తావన “అన్ స్టాపబుల్” షోకీ వచ్చిన ప్రభాస్ ని బాలకృష్ణ అడుగగా దానికి మేడం క్లారిటీ ఇచ్చారు వాటిలో వాస్తవం లేదని ప్రభాస్ తెలిపారు. అయితే ఇప్పుడు నిశ్చితార్ధమని వస్తున్న వార్తలకు ప్రభాస్ టీం క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ మరియు కృతి ఇద్దరు మంచి స్నేహితులని క్లారిటీ ఇవ్వటం జరిగింది. మాల్దీవులలో నిశ్చితార్థమని వస్తున్న వార్తలలో వాస్తవం లేదని ఖండించారు.

Prabhas clarity on the news of engagement with Bollywood heroine

ప్రస్తుతం వీరిద్దరూ “ఆదిపురుష్” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ నెలలో రిలీజ్ కానుంది. ఇక ఇదే సమయంలో బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ కూడా వైరల్ అయింది. వచ్చే వారం మాల్దీవ్స్ లో ప్రభాస్, కృతి ఇద్దరూ నిశ్చితార్థం చేసుకోబోతున్నారని… వారిద్దరూ ఒకటి కాబోతుండటం సంతోషంగా ఉందని ట్వీట్ చేయడం మరింత సంచలనంగా మారింది. ఏది ఏమైనా బాలీవుడ్ హీరోయిన్ తో నిశ్చితార్థం అని వస్తున్న వార్తలకు… ప్రభాస్ టీమ్ స్పందించి పుల్ స్టాప్ పెట్టడం.. మంచిదయింది.


Share

Related posts

Pushpa movie: బన్నీ కోసం ఏకంగా 250 కోట్ల రూపాయలు ఖర్చు..?

sekhar

MS Dhoni: నిర్మాతగా ఎంఎస్ ధోని నిర్మిస్తున్న మొదటి సినిమా టైటిల్ పేరేంటో తెలుసా..?

sekhar

అనిల్ రావిపూడి కి సాయి పల్లవి తప్ప ఇంకెవరూ కనిపించలేదు.. అందుకే ఎఫ్ 3 పక్కనపెట్టాడు ..?

GRK