యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ఒకవైపు సుజిత్ దర్శకత్వంలో `సాహో`, మరో వైపు రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న `జాన్` సినిమాలతో బిజి బిజీగా ఉన్నారు. `సాహో` చిత్రీకరణ తుది దశకు చేరుకోగా.. జాన్ సినిమా రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఈ రెండు సినిమాల్లో `సాహో` సినిమా పూర్తిస్థాయి యాక్షన్ మూవీ. భారీ బడ్జెట్‌తో భారీ రేంజ్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో యాక్షన్ ఏపిసోడ్స్ కోసం ఉపయోగించిన కారు, బైక్‌ను ప్రభాస్ ఇష్టపడ్డాడట. సినిమాలో ఆ కార్, బైక్ సంబంధిత సన్నివేశాల చిత్రీకరణ పూర్తవగానే ప్రభాస్ వాటిని సాహో గుర్తుగా ఇంటికి తీసుకెళ్లారని సమాచారం.
previous post
next post