ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలావరకు మల్టీ స్టార్ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అనేక మల్టీ స్టార్ సినిమాలు రావటం జరిగాయి. స్టార్ హీరోలు సైతం కుర్ర హీరోలతో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవలే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “RRR” కూడా మల్టీస్టారర్ గా తెరకెక్కి దాదాపు ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అనేక రికార్డులు సృష్టించింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటించడం జరిగింది. ఇద్దరూ కూడా పోటా పోటీగా నటించి ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు బాగా అలరించారు. ఇలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి చరణ్ రెడీ అయినట్లు లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస నేపథ్యంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అతిధి పాత్రలో నటించనున్నారట.
సీత స్వయంవరంలో శివ ధనుర్భాగం తర్వాత రాముడిని సవాలు చేసే పరుశురాముడు పాత్రలో చరణ్ కనిపించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుడి పాత్రలో దేవ దత్త నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది.
టాలీవుడ్లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొనసాగుతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ లకు సేమ్ టు సేమ్ ఒకే పరిస్థితి ఏర్పడింది. పూర్తి…
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…