సినిమా

Ram Charan-Upasana: మ‌న‌సులో కోరిక బ‌య‌ట పెట్టిన‌ ఉపాస‌న‌.. ఇప్పుడు కాద‌న్న‌ చ‌ర‌ణ్‌!

Share

 

Ram Charan-Upasana: టాలీవుడ్ లవబుల్ క‌పుల్స్‌లో రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న జంట ఒక‌టి. 2012లో అంగ‌రంగ‌వైభ‌వంగా ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట‌.. ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ వ‌రుస సినిమాల‌తో దూసుకుంటే.. ఉపాస‌న అపోలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు మోస్తూ, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఉపాస‌న‌.. తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. `ఎక్కడికైనా చల్లని ప్రదేశానికి వెకేష‌న్‌కి వెళ్లాల‌నుంది.. ఇంత వేడిలో వ‌ర్క్ చేయ‌డం చాలా క‌ష్టంగా ఉంది` అంటూ త‌న మ‌న‌సులో ఉన్న కోరిక‌ను ఇన్‌స్టా పోస్ట్ రూపంలో రివిల్ చేసిన‌. అయితే స‌తీహ‌ణి పోస్ట్‌ను చూసిన రామ్ చ‌ర‌ణ్ బ‌దులిచ్చాడు.

`హాలిడేకి వెళ్లాలని నాకు కూడా ఉంది. కానీ ఏం చేయను కొన్ని రోజులు వేచి చూడక తప్పదు… ` అంటూ ఉపాసనను ట్యాగ్ చ‌ర‌ణ్ ఇన్‌స్టా పోస్ట్ పెట్టారు. దీంతో వీరిద్ద‌రూ పోస్ట్‌లు వైర‌ల్‌గా మారాయి. కాగా, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం వైజాగ్‌లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ అనంత‌రం చ‌ర‌ణ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని శంక‌ర్‌తో అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

`ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇంతకుముందే ఈ సినిమాకి సంబంధించిన ఓ నాలుగు షెడ్యూల్స్ ను పూర్తి చేసిన మేక‌ర్స్‌.. తాజాగా వైజాగ్ లో మరో షెడ్యూల్ ను మొదలుపెట్టారు. ప్ర‌స్తుతం అక్క‌డ చరణ్ కాలేజ్ కి సంబంధించిన సన్నివేశాలు, కియారా-చ‌ర‌ణ్‌ల మ‌ధ్య వ‌చ్చే సీన్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగబోతోంది. ఈ నేప‌థ్యంలోనే చ‌ర‌ణ్ ఉప‌సాన‌కు వెకేష‌న్ ఇప్పుడు కాద‌ని.. ఇంకా దానికి స‌మ‌యం ఉంద‌ని చెప్పాడు.


Share

Related posts

Shivani Narayanan New HD Stills

Gallery Desk

Bhavani Sre Cute Looks

Gallery Desk

BA Raju: బీఏ రాజు కుమారుడి “సూపర్ హిట్” డెసిషన్..!

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar