Renu Desai: రేణు దేశాయ్ గురించి బహుశా తెలియని వారు ఎవరూ ఉండరు. బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేణు దేశాయ్ నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా గడిపారు. కానీ కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ నుంచి దూరంగా ఉన్న రేణుదేశాయ్ తన పిల్లల బాధ్యతలు చూసుకుంటున్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రేణుదేశాయ్ ప్రేమలో పడ్డానని స్వయంగా ఒప్పుకున్నారు.
ఈ సందర్భంగానే పవన్ నుంచి దూరంగా ఉన్న రేణు రెండో పెళ్లి చేసుకోబోతున్నా అంటూ వార్తలు రావడంతో దీనిపై ఆమె అభిమానులు ఎంతో ఆగ్రహించారు. తనని పెళ్లి చేసుకోబోయే అతని చంపేస్తామని ఏకంగా బెదిరించారు. అయితే ఈ పరిణామాలన్నింటి పై రేణు దేశాయ్ స్పందించి తనదైన శైలిలో అందరికీ సమాధానం చెప్పారు.కొద్ది నెలల క్రితం వరకు తనకు ఎంగేజ్మెంట్ కూడా అయిందని చెప్పిన రేణుదేశాయ్ ప్రస్తుతం ఆ మాట ఎత్తడం లేదు. అయితే తాను ప్రేమలో పడ్డాను అనే విషయం మాత్రం ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రస్తుతం ఎన్నో ప్రాజెక్టులను చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న రేణుదేశాయ్ ఒక్కసారిగా ఇలాంటి వార్త చెప్పడంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే రేణుదేశాయ్ ప్రేమలో పడింది ఓ వ్యక్తితో అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. జంతు ప్రేమికురాలు అయిన రేణుదేశాయ్ తనకెంతో ఇష్టమైన ఫ్లూటో అనే కుక్క పిల్ల తో ప్రేమలో పడినట్లు తెలిపారు. జంతువులంటే ఎంతో ఇష్టం ఉండడంతో ఆమె తన ఇంట్లో కుక్కలు, పిల్లులు లు పెంచుకుంటున్నారు. ఈ సందర్భంగా రేణుదేశాయ్ సోషల్ మీడియా ద్వారా ఫ్లూటోను కూడా పరిచయం చేసింది.