క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆ మధ్య నటి శ్రీ రెడ్డి పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి కొంతమంది పేర్లు కూడా బయటపెట్టింది. ఇక బాలీవుడ్లో సైతం మీటూ ఉద్యమం జరుగుతున్నా, కొంతమంది హీరోయిన్స్ కి వన్ నైట్ ఆఫర్స్ ఇస్తున్నారు. పోటుగాడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన సాక్షి చౌదరిని కూడా కొంతమంది వేధిస్తున్నారట. ఒక్క నైట్‌కు కోటి ఇస్తామంటూ ఆఫర్ చేస్తూ తనని వేధిస్తున్నారట.
జేమ్స్‌బాండ్, సెల్ఫీరాజా సినిమాల్లో హాట్ లుక్‌లో కనిపించి యూత్‌ని అట్రాక్ట్ చేసిన, ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్‌కు టచ్‌లోనే ఉంటుంది. తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ కుర్రకారును కిర్రెక్కిస్తున్న ఈ హాట్ బ్యూటీ, ప్రేక్షకుల్ని ఉత్సాహపరచడమే తన పని అని పేర్కొంది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ కొందరు తనకు రేటు కట్టడమే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. హీరోయిన్ అయినంత మాత్రానా తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదని, తనకు వన్ నైట్ ఆఫర్ చేసేవారు మూర్ఖులని ఆవేదని వ్యక్తం చేసింది. ఇదీ మరోసారి రిపీట్ అయితే అందరి బండారం బయటపెడతానని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.