సినిమా

Samantha: గ్లామర్ షోతో సెగలు పుట్టిస్తున్న సమంత… అస్సలు తగ్గడం లేదుగా!

Share

Samantha: ప్రస్తుతం టాలీవుడ్లో హీరోలతో సమానంగా రాణిస్తున్న కథానాయికలలో సమంత ముందుంటుంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. మొదటి సినిమా ఏమాయ చేసావేతోనే తెలుగు యువత మనసుల్ని కొల్లగొట్టింది. దాంతో ఇటు యూత్ లో సామ్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఓ వైపు సేవ కార్యక్రమాలలో కూడా ఈమెది అందెవేసిన చేయి. దాంతో పెర్సనల్ గా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు గడించింది సమంత. తరువాత నాగచైతన్యతో ప్రేమ, వివాహం, ఎడబాటు గురించి అందరికీ తెలిసినదే.

Samantha is Looking great with her glamor
Samantha is Looking great with her glamor

అందాల ఆరబోత ఎందుకోసం?

ఇక విడాకుల అనంతరం సామ్ కాస్త ముందగువేసి సంచలనాత్మకమైన సినిమాలకు సైన్ చేస్తోంది. ఈ క్రమంలో ఈమె చేసిన ‘ఫామిలీ మ్యాన్ 2’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అలాగే పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ కి సామ్ చేసిన డాన్స్ న భూతొ న భవిష్యతి. దాంతో సమంత కెరీర్ పీక్స్ కి చేరినట్లయింది. ఈ క్రమంలో ఎన్నో మ్యాగజిన్ ఫోటో షూట్స్ లలో అమ్మడు పాల్గొంటోంది. తాజాగా స‌మంత రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఇచ్చిన ఫోటో షూట్ స్టిల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సామ్ అందాల ఆరబోతలో ఒకింత బోర్డర్ క్రాస్ అయినట్టు చూసిన ఎవరికైనా అనిపించక మానదు.

Samantha is Looking great with her glamor
Samantha is Looking great with her glamor

అవి ప్రొఫెషన్ లో భాగం మరి!

ఇకపోతే ఇలాంటి ఫోటో షూట్స్ అనేవి తమ వృత్తిలో భాగమే అని చెబుతుంది అమ్మడు. సదరు ఫొటోస్ ని చూసి, కొండతమంది కొంటె నెటిజన్లు కొంటెగా ప్రశ్నిస్తుంటే, సామ్ కూడా కాస్త కటువుగానే సమాధానాలు చెబుతుంది. ఇవి తన ప్రొఫెషన్ లో భాగమని, ఎవరు పని వారు చేసుకుంటే మంచిదని. ఖాళీగా ఉంటే ఇలా ఎదుటివారి ప్రొఫెషన్ లో వేలుపెట్టే ఆలోచనలో వస్తాయని.. కొంటె కుర్రాళ్ళకి సామ్ కాస్త ఘాటుగానే సమాధానం చెప్పింది. ఇకపోతే ఈ ఫొటోస్ చూసిన కొంతమంది ఫాన్స్ మాత్రం సామ్ ని ఆకాశానికెత్తేస్తున్నారు. ఏజ్ పెరుగుతున్నా సమంత బ్యూటీ తరగడం లేదని అమ్మడిని మునగచెట్టు ఎక్కిస్తున్నారు.


Share

Related posts

Vakeel Saab : అభిమానులకోసమేనట.. వకీల్ సాబ్ ఓటిటి రిలీజ్ డేట్..

bharani jella

Shraddha Kapoor White Dress Pics

Gallery Desk

Samantha: ‘ఊ అంటావా’ని మించిన అద్భుతంతో రాబోతోన్న సమంత.. మీ ఊహలకే అందని BOLD నిర్ణయం

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar