Samantha: ఒకే ఒక్క స్టెప్‌తో పూజా హెగ్డేను తొక్కేసిన సమంత..అంటూ ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘బీస్ట్’. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తైన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది.
అయితే, తాజాగా ఈ సినిమా నుంచి నుంచి ‘హలమిత్తి హబీబో’ అనే సాంగ్ రిలీజ్ అయింది. దీనికి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించి..పాడారు. ఈ పాట ఇటీవలే విడుదలైన కొద్ది క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ రాబట్టి దూసుకెళ్లింది. ఈ సాంగ్ పూర్తిగా అరబిక్ స్టైల్ కావడంతో పాటు.. లిరిక్ ను కూడా అరబిక్ అండ్ తమిళ్ మిక్స్ చేసిన పదాలతో ఫ్యూజన్ స్టైల్లో కంపోజ్ చేశారు. దాంతో ఈ సాంగ్ జెట్ స్పీడ్ లో దూసుకెళుతూ యూట్యూబ్‌లో వైరల్ అవుతూ రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.
Samantha: పూజా కంటే సామ్ అదరగొట్టేసిందని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇదే పాటకు పూజా హెగ్డే బెల్లీ డాన్స్ చేస్తూ ఓ వీడియోను తీసింది. దానిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి …హీరోయిన్స్‌కు ఛాలెంజ్ విసిరింది. ఇలాంటి బెల్లి డాన్స్ మూవ్ మెంట్ చేసి వీడియోను అప్లోడ్ చేయమని ఆమె కామెంట్ పెట్టింది. దాంతో ఇటీవల ఏయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సమంత..తాను ఎక్కాల్సిన ఫ్లైట్
లేటవుతుండటంతో బేలో వెళుతూ ఈ అరబిక్ కుత్తు సాంగ్‌కు తన స్టైల్లో ఇరగదీసే స్టెప్పులేసి అదరగొట్టింది. అంతేకాదు ఈ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది. ఫుల్ ఎనర్జీతో సమంత చేసిన ఒక్క స్టెప్ డాన్స్ మూవ్ మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు..పూజా కంటే సామ్ అదరగొట్టేసిందని కామెంట్స్ చేస్తున్నారు.