గతేడాది అక్టోబర్ 4న తమిళ ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా ’96’. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం కోలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. విమర్శకుల ప్రశంశలు దక్కించుకున్న 96 సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్యూర్ లవ్ స్టోరీ కావడంతో యూత్ 96ని రిపీటెడ్ గా చూశారు. ఇంత పెద్ద హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యడానికి దిల్ రాజు రైట్స్ కొన్నాడు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో 34వ చిత్రంగా రూపొందనున్న ఈ 96 రీమేక్ చిత్రంలో శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. `96` చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమకుమార్ తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుకుంటున్న ఈ చిత్రం మార్చి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.