Categories: సినిమా

బండ్లన్నకు స్ట్రాంగ్ కౌంటర్.. ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయానికి సపోర్ట్

Share

ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు నిలిపివేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఇవాళ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు వారం క్రితం తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ దీనిపై నిర్ణయం తీసుకుంది. షూటింగ్ లు ఆపేయాలని వారం క్రితం ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకుంది. ఇవాళ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని, ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్ చేయాలని నిర్ణయించినట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది.

సమస్యలు అన్నీ పరిష్కారం అయ్యే వరకు షూటింగ్లు నిలిపివేస్తామని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. ఆగస్టు 2న మరోసారి సమావేశం అవుతామని తెలిపింది. అయితే ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాలపై బండ్ల గణేష్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేసిన ప్రకటనపై బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. క్రేజ్ ని బట్టి హీరోలకు రెమ్యూనరేషన్ ఉంటుంది, ఎవరి స్థాయికి వారికి ఉంటుందని అన్నారు. హీరోల సినిమాలను మార్కెట్ చేసుకునే దాని బట్టి కలెక్షన్లు వస్తాయని, అంతేకాని రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని కోరడం తప్పుడు నిర్ణయమని విమర్శించారు.

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఉండగా.. ప్రొడ్యూసర్స్ గిల్డ్ అసలు ఎందుకని ప్రశ్నించారు. అలాగే తెలుగు సినిమా నిర్మాతల మండలి ఛైర్మన్ సి.కల్యాణ్, సభ్యులు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, స్టార్ ప్రొడ్యూసర్ సి.కల్యాణ్ కూడా గిల్డ్ నిర్ణయంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్స్ సెక్టర్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి గిల్డ్ నిర్ణయంపై స్పందించారు.

గిల్డ్ నిర్ణయం సరైనదేనని మద్దతు ఇచ్చారు. గిల్డ్ సభ్యులు తీసుకుున్న నిర్ణయానికి నిర్మాతలంతా సపోర్ట్ చేయాలని కోరారు. నిర్మాతలందరూ ఏకతాటిపైకి రావాలని, ఒకే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఉప్మా సినిమాలు తీసే కొంతమంది, అసలు సినిమాలు తీయనివాళ్లు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారన్నారు. ఆయన చేసిన కామెంట్స్ ను బట్టి చూస్తే బండ్ల గణేష్ కు కౌంటర్ ఇచ్చారా? అని కొంతమంది ంటున్నారు.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

3 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

28 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago