న్యూస్ సినిమా

Bunny: ముచ్చటగా మూడోసారి ఆ టాప్ హీరోయిన్ తో బన్నీ..??

Share

Bunny: ఐకాన్ స్టార్ బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రెండు భాగాలుగా చిత్రీకరణ జరుగుతుంది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న మూడో సినిమా కావడంతో “పుష్ప” పై బన్నీ అభిమానులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో “పుష్ప” సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Pooja Hegde Turns Boss For Allu Arjun - IndustryHit.Com

సుకుమార్ మొదటి రెండు సినిమాల కంటే “పుష్ప” లో చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అల్లు అర్జున్ కి క్రియేట్ చేయడం జరిగింది. ఉర మాస్ లుక్ లో బన్నీ కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర లో రష్మిక మందన నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే “పుష్ప” సెకండ్ పార్ట్ లో మరో హీరోయిన్ అవసరం అయిన నేపథ్యంలో ఆ పాత్ర కోసం డైరెక్టర్ సుకుమార్ పూజా హెగ్డే ని తీసుకున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. గతంలో అల్లు అర్జున్ తో పూజా హెగ్డే “దువ్వాడ జగన్నాథం”, “అలా వైకుంఠపురం లో” సినిమాలో నటించడం జరిగింది.

Read More: Allu arjun : అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేయబోతున్న బాలీవుడ్ సినిమా

ఆ రెండిటిలో అలా వైకుంఠపురం లో సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ముచ్చటగా మూడోసారి పూజాహెగ్డే బన్నీతో “పుష్ప” సెకండ్ పార్ట్ లో నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గతంలో సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా లో చరణ్ సరసన ఐటమ్ సాంగ్ లో పూజా హెగ్డే చిందులు వేయడం జరిగింది. అయితే ఈ సారి బన్నీ సరసన పుష్ప సెకండ్ భాగంలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 


Share

Related posts

ట్విట్టర్ పూనిన నాగ”బాంబు”…!

Srinivas Manem

Breaking : అనంతపురం జిల్లాలో నరబలి కలకలం

somaraju sharma

ఘోర రోడ్డు ప్రమాదాలు .. కామారెడ్డి జిల్లాలో 5గురు, రాయచూర్ వద్ద 4 గురు దుర్మరణం

somaraju sharma