విక్టరీ వెంకటేష్, నాగచైతన్య అక్కినేని కలిసి నటిస్తోన్న చిత్రం `వెంకీ మామ`. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ పూర్తయ్యింది. తుదపరి షెడ్యూల్ జమ్మూ కాశ్మీర్లో జరగనుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను జూన్ 6న విడుదల చేయబోతున్నారట. కారణం ఆరోజున డి.రామానాయుడు జయంతి. వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అలాగే వెంకటేష్ రైస్ మిల్ ఓనర్‌గానూ.. నాగచైతన్య మిలటరీ ఆఫీసర్‌గానూ కనిపిస్తారు.