వేట మొదలు పెడుతున్నాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మొదటి కలిసి చేస్తున్న సినిమా వినయ విధేయ రామ. టీజర్ తోనే మెప్పించిన ఈ టీమ్, ట్రైలర్ తో ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు. సినీ అభిమానులందరూ ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్న వినయ విధేయ రామ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అజర్బైజాన్ లో షూట్ చేసిన భారీ ఫైట్ సీన్ లో చరణ్ చెప్పిన అదిరిపోయే డైలాగ్ మొదలైన ట్రైలర్ లో చరణ్, ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ముందెన్నడూ చూడని లుక్ లో కనిపించాడు. తన మేక్ ఓవర్ బాగుంది, కమర్షియల్ హీరోకి ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ చరణ్ బాడీ లాంగ్వేజ్ లో స్పష్టంగా కనిపించాయి. చెర్రీ వాయిస్ అయితే డైలాగ్ కే పవర్ తెచ్చేలా ఉంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే బోయపాటి మార్క్ ఊర మాస్ సినిమాలో చరణ్ అద్భుతంగా ఒదిగిపోయాడు. ట్రైలర్ అంతా వన్ మ్యాన్ షో చేసిన చరణ్ తర్వాత కచ్చితంగా చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి వివేక్ ఒబెరాయ్… ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న వివేక్, చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఇక రామ్ కొణిదెలకి, అదే మన రామ్ చరణ్ కి అన్నగా నటిస్తున్న ప్రశాంత్ సినిమాలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తోంది. ఎంత యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా కూడా ట్రైలర్ లో అక్కడక్కడా వచ్చిన ఫ్యామిలీ సీన్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా ట్రైలర్ చూస్తే వివేక్ ఒబెరాయ్ ఏరియాలో జరగోబోయే ఎన్నికలకి ఆఫీసర్ గా వెళ్లిన ప్రశాంత్ స్ట్రిక్ట్ గా ఉండడంతో, నచ్చని వివేక్ ప్రశాంత్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే… ఈ కష్టం నుంచి అతని తమ్ముడు రామ్, కుటుంబాన్ని ఎలా కాపాడాడు అనేదే ఈ చిత్ర కథలా కనిపిస్తుంది.
సరిగ్గా 01:45 సెకండ్ల డ్యూరేషన్ తో కట్ చేసిన వినయ విధేయ రామ ట్రైలర్ చూస్తే… ఒక మాస్ హీరోకి సరైన డైరెక్టర్ తగిలితే ఎలివేషన్స్ ఏ రేంజులో ఉంటాయో, వాటిని మించి వినయ విధేయ రామ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఊరమాస్ సినిమాలకి కెరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి, సరికొత్త చరణ్ ని చూపిస్తూనే… తన మార్క్ ఎక్కడా మిస్ కాకుండా చూసుకున్నాడు. ట్రైలర్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్ లో సూపర్ గా ఉంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే రంగస్థలం సినిమాతో రికార్డుల మోతమోగించిన సౌండ్ ఇంజనీర్ చిట్టి బాబు, ఇప్పుడు కొణిదెల రామ్ గా మారి వసూళ్ల వర్షం కురిపించాడు సిద్దమవుతున్నాడని అర్ధమవుతోంది. సో ఇప్పుడున్న ఈ భారీ అంచనాలకి పాజిటివ్ టాక్ కూడా తోడైతే చరణ్ రాబట్టే కలెక్షన్ల సునామి, టాలీవుడ్ నాన్ బాహుబలి రికార్డులని తిరగరాయడం ఖాయం