Dasara Teaser Out: నాచురల్ స్టార్ నాని కొత్త సినిమా “దసరా” టీజర్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా నిన్న సాయంత్రం రిలీజ్ అయింది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా ద్వారా పరిచయం కానున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. మాస్.. యాక్షన్ తరహాలో ఫ్యామిలీ డ్రామాగా చిత్రీకరించినట్లు టీజర్ బట్టి అర్థమవుతుంది. “దసరా” టీజర్ లో నాని మరోసారి తన నటన విశ్వరూపం చూపించారు. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. గుబురు గడ్డంతో మాస్ రఘడ్ లుక్ లో నాని చాలా ఆకట్టుకోవడం జరిగింది. గతంలో నాని నటించిన భీమిలి, పిల్ల జమిందార్ తరహా పల్లెటూరు సహజ సిద్ధమైన వాతావరణం లొకేషన్ ల తరహలో “దసరా” షూటింగ్ జరిగినట్లు కనిపిస్తుంది.

తెలంగాణ ప్రజల జీవనవిధానం తరహాలో గోదావరిఖని సమీపంలో.. సింగరేణి ప్రాంతానికి చెందిన పల్లెటూరు యువకుడిగా ఈ సినిమాలో నాని కనిపిస్తున్నారు. రివేంజ్ డ్రామా నేపధ్యంలో పొలిటికల్ లీడర్ తో… వైరం అన్న తరహాలో టీజర్ లో సన్నివేశాలు కనిపిస్తున్నాయి. నటుడు సాయికుమార్ నెగటివ్ పాత్రలో కనిపించడం జరిగింది. ఇప్పటివరకు నాని నటించిన అన్ని సినిమాలలో కంటే “దసరా”లో చాలా రఫ్ లుక్ లో కనిపిస్తున్నారు. మార్చి 30వ తారీఖు ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్..గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేయడం జరిగింది. ఇక తాజాగా విడుదలైన టీజర్ మరింత హైప్ క్రియేట్ చేయడం జరిగింది.

షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ సినిమాకి బయట నెలకొన్న హైట్ బట్టి దాదాపు 100 కోట్ల బిజినెస్ జరిగిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఇంకా కన్నడ భాషలలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు టీజర్ నీ ఎస్ ఎస్ రాజమౌళి రిలీజ్ చేయగా హిందీ టీజర్ షాహిద్ కపూర్, మలయాళం టీజర్ దుల్కర్ సల్మాన్, తమిళ్ టీజర్ ధనుష్, కన్నడ టీజర్ రక్షిత్ శెట్టి రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ బాగా ఆకట్టుకోవటంతో సినిమాపై అంచనాలు డబల్ అయ్యాయి.