NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope డిసెంబర్ 20th ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

డిసెంబర్ –  20 – మార్గశిర మాసం –  ఆదివారం.శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, ఆదివారం, తిథి: షష్ఠి (సుబ్రహ్మణ్య షష్ఠి), పగలు 2.53 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: శతభిషం రాత్రి 9.01 వరకు తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రాత్రి తెల్లవారు జాము 3.58 నుండి తెల్లవారు జాము 5.42 వరకు, అమృత ఘడియలు: పగలు 1.25 నుండి 3.06 వరకు, రాహుకాలం: పగలు 4.22 నుండి సాయంత్రం 5.45 వరకు, దుర్ముహూర్తం: పగలు 4.17 నుండి సాయంత్రం 5.01 వరకు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి : ధనం మీద ఆసక్తి చూపుతారు !

ఈరోజు ధనం మీద ఆసక్తి చూపుతారు. ఈరోజు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఈరోజు తలపెట్టిన పనులను ఎంత కష్టమైనా పూర్తి చేస్తారు. మీరు చేసే పని మీద ఏకాగ్రత చూపి ముందుకు సాగుతారు. ప్రతి విషయాన్ని బాగా ఆచితూచి ముందుకు అడుగు వేస్తారు. ఈరోజు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ఉన్నత అవకాశాలు వస్తాయి. ఈరోజు ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారు. ఈరోజు స్నేహితులతో సఖ్యతగా ఉంటారు ఈరోజు ముఖ్యమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఏమైనా వస్తువులను క్రయవిక్రయాలు చేస్తారు. ఈరోజు అప్పుల బాధ నుంచి బయట పడే అవకాశం ఉంది. విద్యార్థులు విద్య మీదనే మంచి శ్రద్ధ వహించి పోటీపరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. నూతన విద్యా విధానం మీద శ్రద్ధ చూపుతారు. స్త్రీలకు ఆభరణ యోగ్యత కలిగే అవకాశం ఉంది. ఈరోజు అందరితో సంతోషంగా గడుపుతారు. ఈరోజు వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన రోజు.

రెమిడీ: ఈరోజు దేవీ దశనామ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి : ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది !

ఈరోజు చెప్పుడు మాటలు వినకుండా ఉండటం మంచిది. ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఎవరితో అనవసరంగా తగాదాలు, వాదోపవాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఈరోజు మీరు ఎవరిని తొందరగా నమ్మకండి. ఈరోజు సోదరులతో సఖ్యత గా ఉండటం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు పనులను వాయిదా వేయకుండా అనుకున్న సమయంలో పూర్తి చేసుకోండి. ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలు మానకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులు పెద్దవారితో ఎవరితో గొడవ పడకుండా విద్య మీద శ్రద్ధ శ్రద్ధ వహించండి. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోండి.

 

మిధున రాశి : శుభవార్తలు వింటారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు రుణాలను తీర్చుకుంటారు. సోదరుల నుంచి , బంధువుల నుంచి నుంచి శుభవార్తలు వింటారు. ఈరోజు అన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు విద్యార్థులు విద్య మీద మంచి శ్రద్ధ వహించి చదవాలని అనుకుంటారు. ఈరోజు క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన రోజు. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన రోజు. రాబోయే రోజుల కోసం డబ్బులను పొదుపు చేయాలని అనుకుంటారు. ఈరోజు అనుకోని అవకాశాలు. ఈరోజు పుట్టింటి నుంచి శుభవార్త వింటారు.

రెమిడీ: ఈరోజు లలితా అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి : ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈరోజు చేపట్టిన పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మానసిక ఆందోళనకు గురి అయ్యే అవకాశం ఉంది. ఈరోజు కోపానికి దూరంగా ఉండండి. ఇతరులు మీ తప్పులను బయటికి తీసే అవకాశం ఉంది. ఈరోజు సమయానికి నిద్రాహారాలు మాన కండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈరోజు పెద్దవారి అనుమతులను, సూచనలను పాటించడం మంచిది. ఈరోజు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవచ్చు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీలో ఉన్న బాధను ఎవరికైనా చెప్పుకోడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. స్త్రీలు మానసిక కలతకు గురయ్యే అవకాశం ఉంది అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి : బకాయిలు వసూలవుతాయి !

ఈరోజు మంచి అనుకూలమైన రోజు. ఎదుటి వారిని గౌరవించడం, మర్యాద చేయడం చేస్తారు. ఈరోజు కీర్తి ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు. ఈరోజు అందరితో మంచి సఖ్యతగా ఉంటారు. ఈరోజు రుణాలను తీర్చే అవకాశం ఉంది. ఈరోజు డబ్బులు బాగా సంపాదిస్తారు. ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపుతారు. ఈరోజు అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఈరోజు సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈరోజు రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. ఆత్మవిశ్వాసంతో ఏ పని చేసిన విజయం పొందుతారు. ఈరోజు విద్యార్థులు విద్య మీద  శ్రద్ధ చూపుతారు. ఈరోజు ఉద్యోగస్తులకు  అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలమైన రోజు.

రెమిడీ: ఈరోజు దేవి అపరాధ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి : నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు !

ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఈరోజు మిత్రుల వల్ల ధనం ఖర్చయ్యే అవకాశం ఉంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఎవరితో అయినా ఏది మాట్లాడిన ఆలోచించి మాట్లాడండి. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఈరోజు నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. ఈరోజు డబ్బులను తక్కువగా ఖర్చు పెట్టండి. ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలను మానకండి. ఈరోజు కలహాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు విద్య మీదనే ఏకాగ్రతను చూప వలసిన అవసరం ఉంది. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణ చేసుకోండి.

 

తులారాశి : శుభవార్తలు వినే అవకాశం !

ఈరోజు అందరితో మిత్రుత్వంని పెంచుకుంటారు. ఏ పనికైనా కష్టపడి ప్రయత్నిస్తారు. ఈరోజు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు స్నేహితులతో సఖ్యతగా ఉంటారు. ఈరోజు సంతోషంతో ఆనందముతో గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఈరోజు సాంప్రదాయాల మీద, పద్ధతుల మీద శ్రద్ధ చూపుతారు. శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు చేపట్టిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు పెద్దల మాటలను సూచనలను గౌరవిస్తారు. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ చూపి పోటీపరీక్షల్లో విజయం విజయం పొందుతారు. స్త్రీలకు గృహ సౌఖ్యం కలుగుతుంది, పుట్టింటి వారి నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి : మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు చేయని తప్పుకు మీరు నిండ పడే అవకాశం ఉంది. సమయానికి చేతికి డబ్బులు అందకపోవడం వల్ల  ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు ఖర్చులు తగ్గించుకోండి. ఈరోజు అనవసరంగా ఎవరితో గొడవ పడటం, వాదోపవాదాలు పెట్టుకోవడం చేయకండి. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు సమయాన్ని వృధా చేయకుండా అనుకున్న పనిని పూర్తి చేయండి. ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. స్త్రీలకు ఈరోజు మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది జాగ్రత్త.

రెమిడీ:ఈరోజు నారాయణ ద్వాదశాక్షరీ మంత్రాన్ని పారాయణ చేసుకోండి.

 

ధనస్సు రాశి : అనుకూలమైన రోజు !

ఈరోజు సంపద బాగా పెరుగుతుంది. ఈరోజు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు బంధువులందరితో సఖ్యతగా ఉంటారు. ఈరోజు అడిగిన వారికి కాదనకుండా దానధర్మాలు చేస్తారు. ఇంట్లో ఉన్న సమస్యలను తగ్గించుకుంటారు. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యాన్ని తలపెట్టే అవకాశం ఉంది. ఈరోజు చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు అందరితో ఆనందంగా, సంతోషంగా ఉంటారు. మీరు ఈరోజు దైవదర్శనం చేసుకుంటారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. క్రయవిక్రయాలు చేస్తారు. ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు ఆర్థిక ప్రగతి కలుగుతుంది, రుణ బాధల నుంచి బయటపడతారు. ఈరోజు విద్యార్థులు సమయస్ఫూర్తిగా విద్య మీద శ్రద్ధ వహించి చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు అందరితో సంతోషంగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు.

రెమిడీ:  ఈరోజు లింగాష్టక పారాయణాన్ని చేసుకోండి.

 

మకర రాశి : ఈరోజు అనవసరపు ఖర్చులు !

ఈరోజు చెప్పుడు మాటలు వినకుండా ఉండటం మంచిది. ఈరోజు భవిష్యత్తు గురించి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ప్రయాణాలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన ఉండడం మంచిది. ఈరోజు చేపట్టిన పనులు బద్ధకం గా ఉండకుండా అనుకున్న సమయంలో పూర్తి చేసుకోండి. ఈరోజు మీ కోపాన్ని, తొందరపాటు న్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఎదుటి వారు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపే అవకాశం ఉంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.  ఈ జు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత. ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి అనవసరపు విషయాలను పట్టించుకోకుండా ఉంటే మంచిది. ఈరోజు అనవసరపు ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త.

రెమిడీ:  ఈరోజు మంగళ చండికా పారాయణాన్ని చేసుకోండి.

 

కుంభరాశి : పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. క్రొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు తప్పని పరిస్థితుల్లో వేరే వాళ్ళతో పని చేయించుకునే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఈరోజు విద్యార్థులు విద్య మీద ఏకాగ్రతను చూపుతారు. ఈరోజు నీతి నిజాయితీగా ధర్మంగా ఉంటారు. ఈరోజు అనవసరపు వాదోపవాదాలకు వెళ్ళకండి. ఈరోజు మాతృ పితృ పూర్వక ఆస్తులు కలిగే అవకాశం ఉంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ధర్మం కోసం పోరాడుతారు. ముఖ్యమైన విషయాలకు ఈరోజు పరిష్కారం కలిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు సంతోషంగా, ఉషారుగా ఉండాలని అనుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన రోజు. ఈరోజు స్త్రీలకు వారి భర్త పట్ల పిల్లల పట్ల గౌరవం పెరుగుతుంది.

రెమిడీ: ఈరోజు గాయత్రీ కవచం పారాయణాన్ని చేసుకోండి.

 

మీన రాశి : మధ్యవర్తులను నమ్మకండి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.ఈరోజు ఎవరితో గొడవలు, వాదోపవాదాలు పెట్టుకోకండి. ఈరోజు అప్పులు తెచ్చుకోకండి. ఈరోజు పనులను వాయిదా వేయకుండా అనుకున్న సమయంలో పూర్తి చేసుకోండి. ఈరోజు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా కనిపిస్తుంది. ఈరోజు ఎంత డబ్బు ఉన్న సంతృప్తికరంగా ఉండటం  మంచిది. ఈరోజు చెడు సలహాలను ఇచ్చే వారిని నమ్మకండి నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు ఏ విషయానికైనా మధ్యవర్తులను నమ్మకండి. ఈరోజు క్రమశిక్షణగా, నిజాయితీగా ఉండడం మంచిది. ఈరోజు విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా విద్య మీద శ్రద్ధ వహించండి. ఈరోజు వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. స్త్రీలు ఈరోజు గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.

రెమిడీ: ఈరోజు దత్త చరిత్రను పారాయణం చేసుకోండి.

 

Related posts

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju