5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu:  బాబును బ్లాక్ మెయిల్ చేస్తున్న..!? జేసి బ్రదర్స్ ఉద్దేశం ఏమిటి..!?

Share

Chandrababu: అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు జేసి బ్రదర్స్ టీడీపీకి లాభమా..? నష్టమా.. ? వీళ్లు టీడీపీలో ఉండటం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటి..? వాళ్లు మాట్లాడుతున్న మాటలు ఒక రకంగా చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసేలా ఉన్నాయా..? వాళ్ల వల్ల పార్టీలో డిస్ట్రబెన్సెస్ పెరిగాయా..? అనే విషయాలను పరిశీలిస్తే.. జేసి దివాకరరెడ్డి గానీ జేసీ ప్రభాకరరెడ్డి గానీ లోపల ఒకలా బయట మరోలా ఉండరు. ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తారు. రాజకీయాల్లో ఉండే వారు చాలా మంది లౌక్యం ప్రదర్శిస్తుంటారు. కానీ జేసీ సోదరులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తుంటారు. ఆప్ ద రికార్డు అయినా ఆన్ ద రికార్డు అయినా అదే మాట. తేడా ఏమి ఉండదు. చంద్రబాబు ఒక కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని గతంలోనే జేసీ దివాకరరెడ్డి బహిరంగంగానే చెప్పారు.

Chandrababu headache on anantapur tdp issues
Chandrababu headache on anantapur tdp issues

Chandrababu: నాలుగు అసెంబ్లీ సిగ్మెంట్ లలో తాము చెప్పిన వాళ్లకే

అయితే ఇప్పుడు ఆ జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో వీళ్ల జోక్యం ఎక్కువ అవుతోంది. పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పల్లె రఘునాథరెడ్డి టికెట్ ఇవ్వాలనేది పార్టీ ఆలోచన చేస్తుండగా తమ సన్నిహితుడికి టికెట్ ఇప్పించుకోవాలని జేసీ సోదరులు ఆలోచన చేస్తున్నారుట. ఆ క్రమంలోనే పుట్టపర్తిలో పల్లె రఘునాధరెడ్డికి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమంటూ కూడా జేసీ ప్రభాకరరెడ్డి కామెంట్స్ చేశారు. అలానే కదిరి నియోజకవర్గంలో టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్, చాంద్ బాషా లు ఉండగా, ఈ నియోజకవర్గంలో కూడా మరో వ్యక్తికి టికెట్ ఇప్పించుకోవాలి జేసి సోదరులు యోచిస్తున్నారు. అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాలుగు అసెంబ్లీ సిగ్మెంట్ లలో తాము చెప్పిన వాళ్లకే టికెట్ ఇవ్వాలని జేసి సోదరులు కోరుతున్నారు.  అంతే కాకుండా జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ వేలు పెడుతున్నారు అనేది జేసి సోదరులపై ఉన్న పెద్ద అపవాదు. ఆరోపణ.

Chandrababu: ‘కార్యకర్తగా మొత్తం తిరుగుతా’

వీరు ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టడం వల్ల ఆ నియోజకవర్గంలోని నాయకులు ఇబ్బందులు పడే పరిస్థితి. తాజాగా జేసి ప్రభాకరరెడ్డి కళ్యాణదుర్గం వెళ్లారు. అక్కడ చాలా దూకుడుగా మాట్లాడారు. మేము దేనికైనా సిద్ధం. రౌడీ షీట్ అయినా ఓపెన్ చేసుకోండి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు జేసి ప్రభాకరరెడ్డి. ఇదే ప్రభాకరరెడ్డి రెండు రోజుల క్రితం చంద్రబాబు ఫోటో పెట్టుకుని రాష్ట్రం మొత్తం తిరుగుతాను, నన్నెవరూ ఆపేది లేదు. ఈ జిల్లా మొత్తం నాదే, వేరే నియోజకవర్గంలో వేలు పెట్టవద్దు అంటే కుదరదు, ఈ జిల్లాలో టీడీపీ బలోపేతం చేసేందుకు కార్యకర్తగా మొత్తం తిరుగుతా అని చెప్పారు. నియోజకవర్గాల్లో తిరగడం తప్పు కాదు కానీ తన వర్గానికే టికెట్ ఇప్పించుకోవాలి అనుకోవడమే తప్పు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో అదే జరుగుతోంది. ఇది టీడీపీలో ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తోంది.

Chandrababu: పలు నియోజకవర్గాల్లో డిస్ట్రబెన్‌సెస్

జేసి సోదరులు ఒకరకంగా పార్టీకి అసెట్. అనంతపురం జిల్లాలో టీడీపీ కొంత స్ట్రాంగ్ గా ఉంది. వచ్చే ఎన్నికల్లో మెరుగైన సీట్లు వస్తాయని భావిస్తున్నారు అంటే  దానికి కారణంగా జేసి సోదరులు యాక్టివ్ గా పని చేయడం అని చెప్పుకోవచ్చు. వారి పిల్లలు జెసి పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు జనాల్లో తిరుగుతున్నారు. వీరితో పాటు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, శ్రీరాం, నందమూరి బాలకృష్ణ  యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి సీట్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే జేసీ సోదరుల కారణంగా పలు నియోజకవర్గాల్లో డిస్ట్రబెన్ సెస్ వస్తున్నాయని ఆ జిల్లాలోని సీనియర్ నేతల వాదనగా ఉంది. చంద్రబాబు ఇటువంటి సున్నితమైన అంశాన్ని ఏ విధంగా డీల్ చేస్తారు..? అనేది వేచి చూడాలి..!


Share

Related posts

Priyamani amazing pics

Gallery Desk

Today Horoscope డిసెంబర్ 4th శుక్రవారం రాశి ఫలాలు

Sree matha

జగన్ మీద కాదు ! ఉండవల్లి కోపం మొత్తం విజయసాయిరెడ్డిపై !!

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar