NewsOrbit
5th ఎస్టేట్

40 ఇయర్స్ ఇండస్ట్రీ గారికి క్వారంటైన్ లేదా మాస్టారు?

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తన సొంత రాష్ట్రానికి దూరమై అచ్చంగా 68 రోజులు అవుతోంది. ఇకపోతే ఈ రోజునే బాబుగారు ఆంధ్రాలో ల్యాండ్ అయి నేరుగా అమరావతి లోని తన నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన విశాఖ ఎల్జి దుర్ఘటన బాధితులను పరామర్శిస్తారు అని తెలుస్తోంది. ఆ తర్వాత కూడా నేరుగా వెంటనే అమరావతి లోని తన స్వస్థలానికి వెళ్లి ఇంటిలో సేద తీరుతారు. అయితే ఇదంతా మీడియా ద్వారానే తెలిసింది తప్ప ఏపీ ప్రభుత్వం ఏమీ అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. అయితే తెలంగాణ డిజిపి కి చంద్రబాబు తన పర్యటన గురించి తెలియజేయగా ఆయన అనుమతి ఇచ్చాడని అంటున్నారు.

ఇక ఆంధ్ర తరపు నుండి కూడా నిజంగా చంద్రబాబు అనుమతి కోరితే పర్యటనుకు తప్పక అనుమతిస్తామని కూడా అన్నట్లు కొందరి నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బాబు ఏపీకి రావాలని ఇలా దాగుడుమూతలు ఆడుతున్నారా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు ఏపీ పర్యటనకు వస్తే దానిపైన అనుమతించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని  మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు.

మొత్తానికి బాబు అయితే నేరుగా అమరావతి లోని తన ఇంటికి వెళ్లారు కానీ తన పర్యటన విషయమై ఏపీ డిజిపి మాత్రం ఇంకా ఆమోదం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రం నుండి సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. అదీ కూడా రోజుకి అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్న హైదరాబాద్ నుండి. రెండు తెలుగు రాష్ట్రాలు కోవిడ్ 19 నివారణ విషయమై విధించుకున్న కొన్ని రూల్స్ ప్రకారం ఆ రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చినా లేదా ఈ రాష్ట్రం నుండి పక్క రాష్ట్రానికి వెళ్లిన 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి లేదా ప్రభుత్వం వారి పర్యవేక్షణలో క్వారంటైన్ లో అయినా తప్పక ఉండాలి.

వందలాది మంది ప్రజలు ఇప్పటికీ అలాగే చేస్తూ ఉన్నారు కూడా అయితే ఒకవైపు మహానాడుని బాబు అతి త్వరలో నిర్వహించాలని భావిస్తుండగా అందుకు తగిన ఏర్పాట్లు చేసే సమయంలో క్వారంటైన్ ను ఏం పాటిస్తారు అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క వైసీపీ మంత్రులు మాత్రం బాబు వస్తే కచ్చితంగా క్వారంటైన్ కి వెళ్లాల్సిందే అని నొక్కి వక్కాణిస్తుండడా ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదు. మరి దీనికి బాబు ఒప్పుకుంటారా లేదా అన్నది వేచిచూడాలి.

ఇక పోతే రాష్ట్రంలో రాజకీయానికి ఇదే సరైన సమయమని ఏపీకి వచ్చిన ఆయనకు తన పర్యటనకు అనుమతి ఇవ్వకపోయినా.. సెల్ఫ్ క్వారంటైన్ చేయమని అతనిపై ఒత్తిడి పెంచినా నానాయాగీ చేస్తారన్నది 40 ఏళ్లుగా బాబు ని చూస్తున్న వారెవరికైనా అర్థమయ్యే విషయం. అసలు ఇంత వాదన ఏమిటి? ఇది ప్రభుత్వం నిర్ణయం…. అతి సామాన్య ప్రజల నుండి మాజీ ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిన నిబంధనలు అని ఆదేశాలు జారీ చేయకుండా రాజకీయ కోణంలో ఇంత బుజ్జగింపు ఏమిటన్న విషయం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు రుచించడం లేదు.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau