NewsOrbit
5th ఎస్టేట్

వాట్సాప్ లో ఆర్డర్ చేస్తే గుమ్మం దగ్గరకి సరుకులు!

 

కరోనా ప్రభావం వల్ల లాక్ డౌన్ మొదలైన తొలినాళ్లలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు సంశయించేవారు. ఒకేసారి ఒక్కరే బయటికి వెళ్లి 4 రోజులకు సరిపడా సరుకులు తెచ్చుకుని ఇంట్లోనే కాలం గడిపిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సడలింపులు ఇచ్చిన తర్వాత అసలు కరోనా అన్న పదమే మాకు తెలియదు అన్నట్లు రోడ్ల మీద ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. సాయంత్రం వరకు షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వడం మరియు ప్రజలు ఒకే చోట గుమిగూడి, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా షాపింగ్ లంటూ తిరుగుతూ ఉండటం కూడా గత వారం పది రోజులుగా కామన్ అయిపోయింది.

అయితే రెడ్ జోన్స్ మరియు కంటెంట్ క్లస్టర్స్ ఉన్న ఏరియాల్లో మాత్రం ఇప్పటికీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ సమయంలోనే ఆన్ లైన్ సేవలను వారి ఉపయోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ రంగంలో ఈ కార్ట్ సంస్థలు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లకు పోటీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో మార్ట్ సేవలను ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట ముంబై, పూణే లలో  మాత్రమే జియో మార్ట్ సేవలను ప్రారంభించారు. అయితే కొద్ది కాలంలోనే ఆ సేవలు విస్తరించేందుకు జియో సంస్థ తన ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. దీంతో దేశవ్యాప్తంగా 200 పట్టణాలలో ప్రస్తుతం జియో సేవలు వినియోగదారులకు లభిస్తున్నాయి.

ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫేస్ బుక్…. జియో లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ వార్త కొద్దిరోజుల ముందే దేశవ్యాప్తంగా హల్ చల్ చేసింది. ఇప్పుడు దీనివల్ల వాట్సాప్ ద్వారా జియో మార్ట్ సేవలను వినియోగదారులు పొందే అవకాశం లభించింది. మనం రోజు మెసేజింగ్ మరియు స్టేటస్ అప్ లోడ్ చేసుకునేందుకు ఉపయోగించే వాట్సాప్ ద్వారా మనకు కావాల్సిన సరుకులను ఆర్డర్ చేస్తే కొద్ది గంటల్లోనే మన ఇంటి వద్దకే సరుకులను డెలివరీ చేస్తారు.

అయితే జియో లో ఫేస్బుక్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ సంస్థలు కూడా భారీ ఎత్తున వాటాలను కొనుగోలు చేశాయి. ఈ క్రమంలో త్వరలో జియో మార్ట్ సేవలను దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం…? ఈ వాట్సాప్ నెంబర్ ను జియో మార్ట్ కు లింక్ చేసి మీ పట్టణంలో ఈ సేవలు పొందవచ్చో కూరగాయలను డోర్ డెలివరీ చేయించుకోచ్చో లేదో చెక్ చేసుకోండి.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau