5th ఎస్టేట్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Daggubati X Chandrababu: దగ్గుబాటి టీడీపీలో చేరరు గాక, చేరరు..! బాబు “వెన్నుపోటు” పేరెలా వచ్చింది..!?

Daggubati X Chandrababu: Dark Secrets Behind Chandrababu Vennupotu Story
Share

Daggubati X Chandrababu: చంద్రబాబుని ఎవ్వరు, ఎప్పుడు విమర్శించాలన్నా.. నాడు కాంగ్రెస్ అయినా, నేడు వైసీపీ అయినా.. ఏ నాయకుడైనా నిద్రలో లేచినా సరే “వెన్నుపోటు” బాబు అనే పేరు పెడతారు. బాబుకి ఆ పేరు రావడం వెనుక ఒక పెద్ద చరిత్ర ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకయ్యా..? అంటే.. బాబుతో పాటూ ఆ వెన్నుపోటు కార్యక్రమంలో పాలుపంచుకుని.., ఆ తర్వాత బాబు వైఖరి నచ్చక.. బాబు అసలు బాగోతం తెలుసుకుని.. బాబుకి దూరమై.. మళ్ళీ ఇప్పుడు “అదే బాబు అధినేతగా ఉన్న తమ సొంత కుటుంబ పార్టీలోకి వారసుడి చేరిక” అనే పుకార్లు ఎదుర్కొంటున్న దగ్గుబాటి ఉదంతం చెప్పాలంటే ఇది మొత్తం తెలుసుకోవాల్సిందే..!

Daggubati X Chandrababu: దగ్గుబాటి టీడీపీలోకి చేరుతారా..!?

ఏపి టీడీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి ఫ్యామిలీ చేరబోతున్నది అని గత రెండు వారాలుగా సోషల్ మీడియాలో,డిజిటల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ఆయన సోదరి పురందేశ్వరి, బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావులతో చర్చలు జరిపారనీ, వారి కుమారుడు దగ్గుబాటి హితేష్ చీరాల నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని వార్తలు వినబడుతున్నాయి. అసలు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే దగ్గుబాటి, చంద్రబాబు ఫ్యామిలీకి ఎక్కడ గ్యాప్ వచ్చింది..ఇప్పుడు టీడీపీలోకి దగ్గుబాటి ఫ్యామిలీ వస్తే ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి..? రేపు భవిష్యత్తులో గతంలో జరిగిన చేదు అనుభవాలను మళ్లీ భవిష్యత్తులో గుర్తుకు తెచ్చుకోకుండా ఉండగలరా.. ? నిజాయితీగా కలిసి మెలసి ఉండగలరా..? అసలు ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఇద్దరు అల్లుళ్ల మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏమిటి..? గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏమి చేశారు..? చంద్రబాబు ఏమి చేశారు.. ? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏలా ఉండబోతున్నాయి..? అనేది పరిశీలిస్తే..

Daggubati X Chandrababu: Dark Secrets Behind Chandrababu Vennupotu Story
Daggubati X Chandrababu: Dark Secrets Behind Chandrababu Vennupotu Story

Daggubati X Chandrababu: నాడు ఏం జరిగింది..!?

1996 ఆగస్టు టీడీపీ సంక్షోభం, వైశ్రాయ్ హోటల్ వద్ద ఏమి జరిగింది అనే విషయాలు అందరికీ తెలుసు.. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుండి దించేయాలి..! ఎందుకంటే లక్ష్మీపార్వతి చెప్పినట్లుగానే ఎన్టీఆర్ నడుచుకుంటున్నారు అనే అభియోగంపై ఎమ్మెల్యేల్లో తిరుగు బాటు రావడంతో ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఒక్కటైంది. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరు అల్లుళ్లు దగ్గుబాటి, చంద్రబాబు, కుమారులు, కూతుర్లు అందరూ కలిసి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను పోగు చేసి వైశ్రాయ్ హోటల్ లో క్యాంప్ పెట్టారు. ఆనాడు ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేయడంలో చంద్రబాబు పాత్ర ఉంది. అలాగే సమభాగంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర కూడా ఉంది. ఆనాడు ఇద్దరూ ఒకే తరహా పాత్ర పోషించారు. ఆనాడు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు చంద్రబాబుకు ఉండటం వల్ల.. చంద్రబాబు కన్నింగ్ మైండ్ ప్రయోగించడం వలన.. ఈ దగ్గుబాటి ఆ విషయం గ్రహించలేక.. ఆ చంద్రబాబు సీఎం అయ్యారు. మంచి అడ్వినిస్ట్రేటర్, మాటకారి, చీకటి వ్యూహాలు, చతురత.. ఆర్ధిక నిపుణత.. అన్నీ కలిసి రావడంతో చంద్రబాబును సీఎంగా ఎన్నుకున్నారు. చంద్రబాబుకు సీఎం పదవి ఇచ్చి ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన దగ్గుబాటి టీడీపీ నుండి బయటకు వచ్చారు. తనకు పదవి వస్తుందని భావించారు. కానీ ఆయనకు దగ్గకపోవడంతో బయటకు వచ్చేశారు. తరువాత లక్ష్మీపార్వతితో చేతులు కలిపారు. ఆమె పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు అయ్యారు..

Daggubati X Chandrababu: Dark Secrets Behind Chandrababu Vennupotu Story
Daggubati X Chandrababu: Dark Secrets Behind Chandrababu Vennupotu Story

నాడు దగ్గుబాటి ఏం చేశారంటే..!?

తరువాత కాంగ్రెస్ లో వైఎస్ హవా మొదలైన తర్వాత అంటే.. 2000 దశకం ఆరంభంలో దగ్గుబాటి వైఎస్ చేరదీశారు. అలా 2004 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యారు దగ్గుబాటి. చంద్రబాబుకు పూర్తిగా విరోధిగా మారి వైఎస్ రాజశేఖరరెడ్డికి దగ్గర అయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో పర్చూరు నుండి పోటీ చేసి గెలిచారు. అయితే 1999, 2004, 2009 ఎన్నికల్లో వైశ్రాయ్ హోటల్ జరిగిన ఘటనను పదే పదే అప్పట్లోనే వీధుల్లో.., పల్లెల్లో ఎల్సీడీ స్ర్కీన్ లో చూపించి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అని ప్రచారం చేశారు. కానీ ఎన్టీఆర్ ను దింపడంలో చంద్రబాబు పాత్ర ఎంత ఉందో.. దగ్గుబాటి సహా కుటుంబ సభ్యుల పాత్ర మొత్తం అంతే ఉన్నప్పటికి.., బాబుని బూచిగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. దాన్ని వెన్నుపోటుగా అభివర్ణిస్తూ చంద్రబాబును విమర్శిస్తున్నారు. మొత్తం తెలిసిన వ్యక్తి, మొత్తం నడిపించిన వ్యక్తి, పాత్రధారి అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా వెన్నుపోటు వెన్నుపోటు అంటూ ప్రచారం చేశారు. అది టీడీపీని చాలా దెబ్బకొట్టింది. చంద్రబాబును మానసికంగా ఇబ్బందికి గురి చేసింది. తనతో పాటు ఉన్న వ్యక్తి, బంధువు ఇలా చేయడం ఏమిటి అని చంద్రబాబు బాగా హర్ట్ అయ్యారు. అక్కడ చంద్రబాబుకు, దగ్గుబాటికి బాగా చెడింది. సో..
ఆ సీన్ కట్ చేస్తే..

Daggubati X Chandrababu: Dark Secrets Behind Chandrababu Vennupotu Story
Daggubati X Chandrababu: Dark Secrets Behind Chandrababu Vennupotu Story

ఇప్పుడు ఎలా మళ్ళీ కలవగలరు..!?

ఇప్పుడు దగ్గుబాటి టీడీపీలోకి వస్తే చంద్రబాబు ఏ రకంగా ఆహ్వానించగలరు.. ? రాజకీయాల్లో నారా వారసుడు లోకేష్ వచ్చారు. దగ్గుబాటి వారసుడు హితేష్ వచ్చారు. వీరిద్దరి మద్య మంచి రిలేషన్ ఉంది. సొంత అన్నతమ్ముల మాదిరిగానే ఉంటున్నారు. చీరాల ఫ్రాంతంలోని హితేష్ ఫ్యాక్టరీకి 2014 – 2019 టీడీపీ ప్రభుత్వం ఉండగా సంపూర్ణ సహకారాలు అందించారు. అప్పట్లో లోకేష్ దగ్గుబాటి ఫ్యాక్టరీకి అవసరమైన పనులు చేసి పెట్టారని కూడా వార్తలు వచ్చాయి. హితేష్, లోకేష్ మద్య మంచి సంబంధాలు ఉండగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు మధ్య మాత్రం ఎప్పటికీ చెరిగిపోలేని గీతలు ఏర్పడ్డాయి. చేదు జ్ఞాపకాలు మిగిలాయి. ఆ చేదు జ్ఞాపకాలు మరచిపోయి రాజకీయంగా ఇద్దరు ఒకటి అవ్వలేదు. దగ్గుబాటిని టీడీపీలోకి మనస్పూర్తిగా చంద్రబాబు ఆహ్వానించలేరు. అలాగని వారి వారసుడు హితేష్ కు అన్యాయం చేయలేరు. హితేష్ టీడీపీలోకి రావడానికి రెడీ,. ఆయనకు సీటు ఇవ్వడానికి టీడీపి సిద్దం కానీ వెంకటేశ్వరరావు, పురందేశ్వరిల విషయంలోనే ఒక పెద్ద తతంగం జరుగుతోంది. ఈ చేదు జ్ఞాపకాలు మరచిపోవడానికే బాలకృష్ణ రాయబారం చేస్తున్నారనేది టాక్. బాలకృష్ణ ఈ విషయంలో సక్సెస్ అయితే పాత జ్ఞాపకాలు అన్నీ మరచిపోతారు. గతంలో జరిగిన సంఘటనల పట్ల భువనేశ్వరి కూడా బాగా హర్ట్ అయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి. సో.., దగ్గుబాటి వెంకటేశ్వరరావు అయితే పార్టీలో చేరే అవకాశం లేదు. కానీ హితేష్ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా టీడీపీలో చేరడం అనేది జరుగుతుంది అని మాత్రమే చెప్పవచ్చు..!


Share

Related posts

Harish Rao: ఈట‌ల‌కు అదిరిపోయే షాకిచ్చిన హ‌రీశ్ రావు

sridhar

CBSE Class 12 Exams: పిఎం మోడీ కీలక నిర్ణయం..జగన్‌కు షాక్..!!

somaraju sharma

బ్రేకింగ్ : నిన్న నిర్ణయం… నేడు ఈవెంట్!  జగన్ స్పీడ్ మామూలుగా లేదు

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar