NewsOrbit
5th ఎస్టేట్

చంద్రబాబు తన ఫోన్ నుంచి డయల్ చేసినా ఎత్తని ఎమ్మెల్యే…!

చాలా రోజులు గ్యాప్ తర్వాత బాబు రాష్ట్రం లోకి ప్రవేశించిన వెంటనే వైసీపీ పై ఎదురు దాడి చేసేందుకు మహానాడు ని తల పెడుతున్న ప్రస్తుతం వారి పార్టీలో ఉన్న 23 ఎమ్మెల్యేల లో ఎంతమంది ఉంటారో ఎంతమంది జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఇక మహానాడు సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే చాలా యాక్టివ్ గా పాల్గొనవలసి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ఫ్యూచర్ ప్లాన్స్ పైన చర్చ మరింత జోరందుకుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం వంటివారు తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీ చెంతకు చేరారు. ఇప్పుడు వారితో పాటు మరో ముగ్గురు లైన్ లో ఉన్నారని వాదనలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి.

అంతెందుకు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా ఛానల్స్ లోనే ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారు అంటూ ఖచ్చితమైన వార్తలు వస్తున్నాయి. పేపర్లలో అయితే కథనాలు బలంగా వినిపిస్తున్నారు. వారిలో ఒకరు ప్రకాశం జిల్లా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కాగా మరొకరు గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఇక ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కూడా జగన్ చెంతకు చేరనున్నారని ప్రచారం సాగుతోంది. అయితే వీరందరిలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అయితే పార్టీలోని చాలా కీలక వ్యక్తి.

ఈ న్యూస్ తెలుసుకున్న వెంటనే టిడిపి అధినేత రంగంలోకి దిగి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఏలూరు సాంబశివరావు మరియు గొట్టిపాటి రవి వారి నిర్ణయాలను మార్చుకునే ఛాన్సులు ఉన్నా కూడా సత్య ప్రసాద్ విషయంలో మాత్రం చంద్రబాబు ఏం చేయలేకపోతున్నారు అని తెలుస్తోంది. పార్టీలో మహానాడు ప్రారంభించిన నేపథ్యంలో ఇతర నాయకులలో ఉన్న జోష్ అనగాని లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక ఏకంగా చంద్రబాబు గారు మహానాడులో పాల్గొనేందుకు అనగాని కి స్పెషల్ ఫోన్ కాల్ చేసినా కూడా ఆయన స్పందించే పరిస్థితి లేదు అంటే విషయం అర్థం చేసుకోవచ్చు

ఇక అటువైపు నుండి జగన్ కూడా సత్యప్రసాద్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారని వైసిపి వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది. ఇప్పటికే రేపల్లె నుండి వైసిపి నాయకుడిగా మోపిదేవి రమణ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గంలోని బలమైన నాయకుడిగా ఉన్న అనగానిని వైసీపీ వైపు వస్తే ఇక ఆ జిల్లాలో తమకు ఎదురే ఉండదు అన్నది జగన్ వ్యూహం. రెండు సార్లు గెలిచి రేపల్లె లో మంచి పట్టు సంపాదించుకున్న అనగాని సత్యప్రసాద్ తో వారి ఓటు బలాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నది వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau