NewsOrbit
5th ఎస్టేట్

టీవీ9 మీద తెలంగాణ ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది…!

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మీడియా సంస్థలలో టీవీ9 చాలా కాలం నుండి అగ్రగామిగా వెలుగొందుతోంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మధ్యన పొద్దున లేచినప్పటినుండి సోషల్ మీడియాలో టీవీ9 ఛానల్ కు ఒకటే తిట్లు.. శాపనార్ధాలు. వారి వార్తలు ప్రజెంటేషన్ మరియు డిబేట్ కోసం తీసుకునే అంశాలు… వారు వేసే వార్తల్లో ఉండే కంటెంట్ చాలామందికి నప్పదు. అంతేకాకుండా జాతీయవాదులు ఈ ఛానల్ ని ఎక్కువగా ద్వేషిస్తుంటారు అని అపవాదు కూడా ఉంది. ఇక నాస్తికుడిగా చెప్పుకునే రవి ప్రకాష్ నాటి నుండి ప్రస్తుతం ఆస్తికుడిగా కనిపించే మై హోమ్ రామేశ్వరరావు వరకూ ఎవరి చేతుల్లోకి వచ్చినా కూడా ఛానల్ పైన ప్రజలకు అభిప్రాయం మారలేదు అనే చెప్పాలి.

 

ఇక తాజాగా ఈ ఛానల్ పైన వచ్చిన విమర్శ ఏమిటంటే… వారు మొన్ననే ఒక స్క్రోలింగ్ వేశారు. “హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ…. ప్రాంతం ఏదైనా మరే ఛానల్ కి అందనంత దూరంలో మా టీవీ9 తెలుగు” అని. దీంతో తెలంగాణ వాసులకి ఈ ఛానల్ పై చిర్రెత్తుకొచ్చింది. తెలంగాణ పోరాట సమయంలో కూడా ఆ ఛానెల్ పై తెలంగాణ వ్యతిరేక ముద్ర ఉండేది. ఎక్కువగా ఆంధ్ర జర్నలిస్టులు ఉండటం మరియు ప్రజల ఆకాంక్షల మేరకే మా పంథా అని రవి ప్రకాష్ అన్నా అటువంటి భావాన్ని ఎప్పుడూ ఆచరణలో చూపించకపోవడం దానికి కారణాలు. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ వారి పాలనను వెక్కిరిస్తూ చాలా రోజులు ప్రభుత్వ ఆగ్రహానికి గురై కనిపించకుండాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఇప్పుడు హైదరాబాద్ మరియు తెలంగాణ లను వేర్వేరుగా చూపించడం ఏమిటని వారిపై తెలంగాణ ప్రజలకు గుస్సాయిస్తున్నారు. అసలు వారి పబ్లిసిటీ కోసం ఈ హెడ్డింగ్ వాడడం కూడా కొంచెం ఓవర్ అనే చెప్పాలి. టీవీ9 కి సెల్ పబ్లిసిటీ అవసరమే లేదు. ఎంతోకాలంగా నిజంగానే రెండు రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా ఉంటూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది.

అయితే ఇక్కడ చాలా మందికి తెలియని నిజం ఏమిటంటే… హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడు వేరు వేరు అన్నది టీవీ9 చేసిన సొంత వర్గీకరణ అయితే కాదు. బార్క్ అనే రేటింగ్ సంస్థ మూడు విభాగాలుగా రేటింగ్ లు ఇస్తూ వస్తోంది. పత్రికలకు ఏబీసీ, ఐఆర్ఎస్ ఎలాగో…. టీవీ చానళ్లకు బార్క్ అలాగ. రేటింగ్స్ నిర్ధారణకు లెక్కలోకి తీసుకునే ప్యారామీటర్ల సంఖ్యపై, ఎంచుకునే ప్రతిపాదనల శాస్త్రీయత పై విమర్శలు ఉన్నప్పటికీ టీవీ9 లాంటి చానెళ్లకు బార్క్ మాత్రమే ప్రామాణికం.

ఈ బార్క్ రేటింగ్స్ ఆధారంగా పెద్ద పెద్ద కంపెనీలు యాడ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, హైదరాబాద్ లను విడివిడిగా చూస్తూ ఉంటారు. అంతేతప్ప విషయంలో టీవీ9 కు ఎటువంటి కక్ష మరియు ద్రోహం బుద్ధి కానీ లేవు. ఆ విమర్శలు సరైనవి కావు. పాపం టీవీ 9 ప్రజల ఆగ్రహానికి అనవసరంగా గురై తిట్లు తిన్నది.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment