NewsOrbit
5th ఎస్టేట్

మోడీ చేతకానితనమే తప్ప దీనికి ఆన్సర్ ఇంకేంటి?

సంవత్సరం క్రితం భారత సైన్యం మీద పుల్వామా అటాక్ జరిగినప్పుడు వరుసగా ఉన్న శవపేటికల ముందు చేతులు జోడించి నివాళులు అర్పిస్తూ గంభీరంగా నడుస్తున్న మన ప్రధాని మోదీ ని చూసి అంతా గర్వపడ్డారు. అప్పడు పని చేసిన వారు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పిన మోదీ అందుకు తగిన యాక్షన్ కూడా తీసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో పుల్వామా దాడిలో అసువులుబాసిన మన సైనికుల భౌతిక దేహాలు కు సోషల్ మీడియా మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియా బాగా కవరేజ్ ఇచ్చింది. మరణానికి ప్రతీకారం కచ్చితంగా ఉంటుందని దేశం తరఫున వారే హామీ ఇస్తున్నట్లు అనేకానేక ప్రసారాలు చేశారు కూడా.

Parallels between Modi's India and Tsarist Russia

ఇకపోతే ఇప్పుడు 20 మంది భారత సైనికులు లడక్ సరిహద్దు ప్రాంతంలో విచక్షణారహితంగా రాళ్లతో కొట్టబడి, ఇనుపరాడ్లతో చితకబాది మరియు ఇనుప ముళ్ళతో కట్టబడిన కర్రలతో చంపిన చైనా సైనికులను ఏం చేయాలి? చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికుల ఉద్దేశించి నివాళులర్పిస్తూ నరేంద్ర మోడీ మీ త్యాగం వృధా కాదు అని అన్నాడు కానీ ఇందుకు ప్రతీకార చర్యలు ఉంటుందని మాత్రం ఎక్కడ చెప్పనే లేదు. దానికి దీనికి ఏమిటి తేడా?

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చేరచ ఏంటంటే పుల్వామా దాడి లో సైనికులు మరణిస్తే ఒకలాగా.. లడఖ్ వద్ద సైనికులు మరణిస్తే మరొక లాగా ఎందుకా తేడా? రెండు ఘటనల్లో చనిపోయింది భారత సైనికులు కానీ ఇప్పుడు పలువురు చెబుతున్నారు ఏమిటంటే అప్పుడు ఏవో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాజకీయ లబ్దికోసం హంగామా చేశారని…. కానీ ఇప్పుడు ప్రయోజనమూ లేదు అనే భావనతోనే ఇంత నిశ్శబ్దం కేంద్రం వహించడానికి కారణం అని అంటున్నారు. రాహుల్ గాంధీ కూడా చర్చని వాడుకోవడానికి మోడీజీ ఎందుకీ మౌనం..? మాట్లాడండి అని అంటున్నాడు.

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తేడాలను పోల్చుకుంటారు ప్రత్యేకించి ప్రధాని కుర్చీలో ఉన్న పాలకులు ఇలా జాతీయ రక్షణ కు సంబంధించిన అంశం జరిగినప్పుడు.. దేశ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నప్పుడు కూడా తమదైన శైలిలో విశ్లేషించుకుంటూ ఉంటారు. అంతెందుకు నిన్న రాత్రి ప్రధాని మాట్లాడుతూ చైనా వారు తమ సరిహద్దులు దాటి మన దేశంలోకి ప్రవేశించిననేలేదని అన్నారు. అంటే భారత సైనికులే తప్పు చేసి వారి వారి చేత చంపబడ్డారా? ఇదేనా సరిహద్దులో నడుస్తున్న చట్టం? అన్నది సగటు భారతీయుడి ప్రశ్న.

అసలు దీని పైన ఒక ఖచ్చితమైన స్పష్టత ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వం భారత సైనికుల త్యాగం వృధా కాదు అని చెప్పి మరలా వారు ఏదో తప్పు చేసినట్లు చైనాకు వత్తాసు పలకడం ఏమిటో ఎవరికీ అర్థం కావట్లేదు. ఏదో చైనా వారివి రెండు కాంట్రక్టులు రద్దు చేసి వాటిని మీడియాలో హంగామా చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? మరి మోదీ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు  సమాధానం ఇస్తారు? ఎలా ఇస్తారు? అసలు ఇస్తారా లేదా? లేకపోతే విషయంలో తాను ఏమీ చేయలేనని తన చేతకానితనాన్ని పరోక్షంగా ఇలా వెల్లబుచ్చుతున్నారా?

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau