Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “సలార్” సినిమా డిసెంబర్ 22వ తారీకు విడుదల కాబోతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. డిసెంబర్ మొదటి తారీకు “సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్” ట్రైలర్ కూడా విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ లో ప్రభాస్ చాలా వైలెంట్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. కచ్చితంగా ప్రశాంత్ నీల్ హిట్ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కూడా ఓపెన్ కావడం జరిగింది.
ఈ క్రమంలో నైజాం ఏరియాలో “సలార్” మొదటి టికెట్ ఎస్ఎస్ రాజమౌళి భారీ ధరతో కొనుగోలు చేశారు. ఏకంగా 10,116 రూపాయలు చెల్లించి..టికెట్ కొనడం జరిగింది. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో.. డిసెంబర్ 22వ తారీకు ఉదయం 7 గంటల షో రాజమౌళి చూడనున్నారు. నైజాంలో “సలార్” సినిమా రైట్స్ మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సినిమా విడుదలకు ఇంకా వారం రోజులు కూడా టైం లేదు. అయినా గాని ఇప్పటివరకు ఒక ఇంటర్వ్యూ కూడా లేదు. దీంతో అభిమానులు “సలార్” ప్రమోషన్స్ విషయంలో నిరుత్సాహం చెందుతున్నారు. మరోపక్క మేకర్స్ ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా అవసరం లేదు బొమ్మ పెడితే చాలు బ్లాక్ బస్టర్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. “బాహుబలి” తర్వాత ప్రభాస్ నటించిన.. మూడు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.
ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కటం జరిగింది. ప్రభాస్ స్నేహితుడి పాత్రలో పృధ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. జగపతిబాబు విలన్ పాత్ర చేస్తున్నట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్ అని టాక్. “KGF” సినిమాలకి డబల్ త్రిబుల్ గా ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునే.. సీన్స్ సినిమాలో ఉంటాయని సమాచారం.ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ప్రభాస్ నీ చాలా పవర్ ఫుల్ గా చూపించినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆల్రెడీ “కేజిఎఫ్” సినిమాలతో… ప్రశాంత్ నీల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రభాస్ తో “సలార్” సినిమాతో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.