Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “సలార్” నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని “KGF” దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకేక్కించటం జరిగింది. దీంతో భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22వ తారీకు విడుదలైన “సలార్” పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. చాలాకాలం తర్వాత ప్రభాస్ హిట్టు కొట్టడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 2018లో “బాహుబలి” లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ మరో హిట్ అందుకోలేకపోయారు. మధ్యలో మూడు సినిమాలు చేసిన అవి అట్టర్ ప్లాప్ అయ్యాయి.
ఒకపక్క పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ అప్పుడే రావడంతో ప్రభాస్ అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు సినిమాలు చేయలేకపోయారు. అలాంటి పరిస్థితులలో ప్రశాంత్ నీల్ తో… సలార్ ఒప్పుకుని చేయడం… విజయాన్ని అందుకోవటం సంచలనంగా మారింది. ఈ సినిమా విడుదల కాక ముందే రెండు పార్ట్ లుగా… రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ రీతిగానే “సలార్” మొదటి భాగం విడుదల చేయగా రెండో భాగాన్నికి సంబంధించి మొదటి భాగం క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి డైరెక్టర్ సస్పెన్స్ పెట్టడం జరిగింది. దీంతో ఇప్పుడు రెండో భాగం “సలార్” టైటిల్ గురించి రకరకాల చర్చలు జరుగుతుండగా.. “శౌర్యంగా పర్వం” అని క్లైమాక్స్ లో టైటిల్ తెలియజేయడంతో రెండో పార్ట్ టైటిల్ ఇదే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ టైటిల్ కి సంబంధించిన రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఇందులో ప్రభాస్ మరియు పృధ్విరాజ్ మధ్య శత్రుత్వం ఎలా వచ్చింది..? ఖాన్సార్ రాజు ఎవరు అవుతారు..? అనేది చూపించబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ నెలకి వాయిదా పడింది. అయినా గాని సినిమాలో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ డ్రామా ఉండటంతో బ్లాక్ బస్టర్ విజయం మొదటి రోజే సొంతం చేసుకుంది.