Tollywood Couples: వివాహం అనేది ఒక పవిత్ర బంధం. అటువంటి బంధంలోకి అడుగు పెట్టే ముందు అమ్మాయి, అబ్బాయి మధ్య కచ్చితంగా పోల్చి చూసే వాటిలో ఏజ్ అనేది ముందు వరుసలో ఉంటుంది. భార్య కంటే భర్త వయసు ఎక్కువగా ఉండాలి అనే పద్ధతిని పూర్వ కాలం నుంచి ఫాలో అవుతున్నారు. అయితే ఒకప్పుడు భార్య భార్తల మధ్య వయసు వ్యత్సాసం భారీగా ఉండేది. కూతురు వయసు ఉన్న అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకునేవారు. రాను రాను భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ తగ్గుతూ వచ్చింది. ఇప్పటి కాలంలో అయితే కొందరు అమ్మాయిలు తమకంటే వయసులో చిన్నవారిని కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఎవరైనా నచ్చారు అంటే ఏజ్ తో సంబంధం లేకుండా ఏడడుగులు వేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి: తెలుగు సినీ పరిశ్రమలో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న అతికొద్ది మంది హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త నార్నె శ్రీనివాసరావు కూతురు లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. 2011 మే 6న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అయితే ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి మధ్య 8 ఏళ్లు వయసు వ్యత్సాసం. ప్రస్తుతం ఎన్టీఆర్ వయసు 40 కాగా.. లక్ష్మీ ప్రణతికి 32 ఏళ్లు. ఈ దంపతులకు అభయ్ రామ్ మరియు భార్గవ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్: 2000వ సంవత్సరంలో వంశీ మూవీలో జంటగా నటించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ 2005లో పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వయసులో మహేష్ బాబు కంటే నమ్రతనే పెద్దది. వీరి మధ్య నాలుగేళ్లు ఏజ్ గ్యాప్ ఉంది. ఇప్పుడు మహేష్ బాబుకు 48 ఏళ్లు కాగా.. నమ్రత ఏజ్ 52.
అల్లు అర్జున్-స్నేహా రెడ్డి: టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి జంట ఒకటి. 2011 మార్చి 6న హైదరాబాద్లో అల్లు అర్జున్ స్నేహా రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తుగా అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కూతురు జన్మించింది. ఇక అల్లు అర్జున్, స్నేహా మధ్య రెండేళ్లు ఏజ్ గ్యాప్ ఉంది. స్నేహా వయసు 39 కాగా.. అల్లు అర్జున్ కు 41 ఏళ్లు.
రామ్ చరణ్-ఉపాసన: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2012లో ఓ ఇంటివాడు అయ్యాడు. ఆయన ఉపాసన కొణిదెలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి వివాహాన్ని చిరంజీవి చాలా గ్రాండ్ గా చేశారు. వయసు విషయానికి వస్తే.. రామ్ చరణ్ కంటే ఉపాసన ఐదేళ్లు చిన్నది. ప్రస్తుతం రామ్ చరణ్ వయసు 39 కాగా.. ఉపాసన ఏజ్ 34. గత ఏడాది ఈ దంపతులకు క్లిన్ కారా అనే కూతురు జన్మించింది.
నాగార్జున-అమల: రీల్ లైఫ్ లో జంటగా నటించి రియల్ లైఫ్ లో జంటగా మారిన వారిలో నాగార్జున-అమల కపుల్ ఒకటి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత నాగార్జున తన కోస్టార్ అమలను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి మధ్య 8 ఏళ్లు గ్యాప్ ఉంది. నాగార్జునకు ఇప్పుడు 64 ఏళ్లు అయితే.. అమలకు 56 ఏళ్లు.
రవితేజ-కళ్యాణి: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ భార్య గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నాళ్లకు ఆయన తన మేనమామ కూతురు కళ్యాణిని పెళ్లి చేసుకున్నారు. స్వయానా మరదలిని రవితేజ పెళ్లి చేసుకున్నారు. అయితే రవితేజ-కళ్యాణి దంపతుల మధ్య దాదాపు 13 ఏళ్లు వయసు వ్యత్సాహం ఉంది. ప్రస్తుతం రవితేజ వయసు 56 ఏళ్లు కాగా.. కళ్యాణి ఏజ్ 42. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. ఇక రానా దగ్గుబాబు(39), ఆయన భార్య మిహీకా బజాజ్(33) మధ్య 6 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉంది. న్యాచురల్ స్టార్ నాని(40) మరియు ఆయన వైఫ్ అంజనా(35) మధ్య ఐదేళ్లు వయసు వ్యత్సాసం ఉంది.