Brahmamudi: నిన్నటి ఎపిసోడ్ లో సీతారామయ్యకి మాట ఇచ్చినందుకు రాజ్ కావ్య దగ్గర మూడు నెలలు నువ్వు ఇంట్లో ఉండాలి అని చెప్తాడు. కావ్య కూడా మూడు నెలల్లో ఎట్లాగైనా రాజ్ ని మార్చుకోవాలి అని అనుకుంటుంది.
ఈరోజు 194 వ ఎపిసోడ్ లో కావ్య గుమ్మం ముందు ముగ్గు పెడుతూ ఉండగా రాజు చూసుకోకుండా, కావ్య వేస్తున్న ముగ్గుని తొక్కబోతాడు.. వెంటనే కావ్య పెద్దగా అరుస్తుంది రాజ్ ఏమైంది అని అడుగుతాడు కింద ముగ్గు ఉంది చూసుకోలేదా అంటుంది కావ్య. కావిని తిడదాం అనుకునే లోగా సీతారామయ్య గారు అటు నుంచి రావడం చూసి వెంటనే రాజు మనసులో ఈ సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలి తాతయ్య ముందు నటించాలి అని, కావ్యతో ప్రేమగా మాట్లాడటం మొదలుపెడతాడు. కావ్య వేసిన ముగ్గుని పొగుడుతూ ఉంటాడు. వావ్ ఇది ముగ్గు కళాఖండమా అని అంటూ నవ్వుతూ ఉంటాడు.
Nuvvu nenu prema: అనుని అవమానించిన కుచల.. కృష్ణ తన పథకంతో వ్రతాన్ని ఆపగలిగాడా?

కొడుకు మీద అపర్ణ కోపం..
క్షణాల్లో మాట మారిపోయినందుకు కావ్య బిత్తర పోతుంది దూరం నుంచి సీతారామయ్య చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. కావ్య ఇందాకే ముగ్గు తొక్క పోయారు నన్ను ఏదో అనబోయ్యారు అని అంటుంది నేను తొక్క పోవడం ఏంటి తొక్కేవాన్ని అని అనుకున్నాను అంతే, అసలైన నువ్వు రాత్రంతా ముగ్గు ప్రాక్టీస్ చేస్తుంటే ఏంటో అనుకున్నాను ఇంత అద్భుతంగా ముగ్గేస్తావని అనుకోలేదు అని కావిని పొగుడుతూ ఉంటాడు అప్పుడే అపర్ణ వాకిలి ముందుకు వచ్చి నిలబడుతుంది. అపర్ణని చూసుకోకుండా రాజు కావిని పొగుడుతూ మా అమ్మ కూడా ముగ్గేస్తుంది గజిబిజిగా గీతల గీతలుగా కానీ నువ్వేసే ముగ్గు చాలా అద్భుతంగా ఉంది. అసలు మా తాతయ్య గాని ఈ ముగ్గుని చూస్తే భూమ్మీద కాకుండా ఆకాశంలోకి ఎత్తేసి అక్కడ కూడా ముగ్గేయి అమ్మ అని అంటాడు తెలుసా అంటాడు రాజు కావ్య తో, అలా మాట్లాడి రాజ్ పక్కకు తిరిగి చూస్తే అక్కడ అపర్ణాదేవి ఉంటుంది అపర్ణాదేవిని చూసి రాజు వామ్మో అమ్మ ఇక్కడే ఉంది అని మనసులో అనుకొని ఎందుకు నోట్లో ఉంది కదా అని అలా మాట్లాడతావు అని ఒకసారి గా షాక్ అవుతాడు రాజ్ వాళ్ళ అమ్మని చూసి, అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రాణి ఛాన్స్ దొరికింది నీ పుత్రుడు చూడు ఎలా పొగుడుతున్నాడు నీ కోడల్ని అని అంటుంది. అపర్ణ రాజుని చూసి చాలా కోప్పడుతూ ఉంటుంది. తాతయ్యని సంతోష పెట్టే పనిలో మమ్మీ చేత తిట్లు తింటానేమో అని అనుకుంటాడు రాజ్ మనసులో, రుద్రాణి అపర్ణ కోపాన్ని ఇంకొంచెం పెద్ద చేస్తుంది. కావాలనే అపర్ణతో పెళ్ళాం బెల్లం తల్లి అల్లం ఏంటో ఈ గొల్లం అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి. దీంతో ఇంకా రగిలిపోతుంది అపర్ణ.

అనామికని తిట్టిన అప్పు..
అప్పు, కళ్యాణ్ బండిమీద వెళుతూ ఉంటే ఎదురుగా ఒక కారు సడన్ బ్రేక్ వేసి ఆగుతుంది దాంతో కళ్యాణ్ అప్పు బండితో సహా కింద పడిపోతారు. వెంటనే అప్పు ఆవేశంగా లేచి ఆ కారు దగ్గరికి వెళ్లి అద్దం దించు ముందు నువ్వు బయటికి రా అంటుంది అందులో ఒక అమ్మాయి బయటకు వచ్చి నిలబడుతుంది. తను ఎవరో కాదు కళ్యాణ్ అభిమానిస్తున్న అనామిక అప్పు ఆడపిల్లవా, నేనెవరో అబ్బాయి అనుకున్నాను కిందకి దిగు మనుషుల్ని చంపేద్దాం అనుకుంటున్నావా లైసెన్స్ తీ అంటూ అనా మీకు అని కారు దిగేలా చేస్తుంది అప్పుడే కళ్యాణం అనామికని చూసి ఏంటి అప్పు గొడవ పడుతుంది. అనామికతోనా ఆపాలి అని అప్పు దగ్గరికి వెళ్లి పక్కకి రమ్మని చెప్తాడు. బ్రో ఆగు బ్రో తను అనామిక వదిలేయ్ అంటాడు రిక్వెస్ట్ గా కళ్యాణ్. అయితే అప్పుకి మొదటి అర్థం కాదు తను అనామిక అయితే ఏంటి అనామకురాలు అయితే నాకేంటి అని అంటుంది కాసేపాగిన తర్వాత ఓహో ఈ పిల్ల పిచ్చి కవితలు అభిమానించే పిచ్చి పిల్ల కదా అని వస్తుంది. వెంటనే అనామికతో అప్పు ఏంటి నువ్వు పేరు అడిగితే చెప్పడం చేతకాదు అడ్రస్ అడిగితే ఏవేవో రాసి పంపిస్తావు అని అంటుంది. అప్పు అనామిక అప్పుతో బ్రో కి చాలా కోపం వచ్చినట్లుంది అని అంటుంది.అనామిక కళ్యాణ్తో ఏంది బ్రో గాంధీ తాత దగ్గరికి తాత అయినట్లు మీకు ఈ అమ్మాయికి నేనే బ్రో అని అంటుంది. సారీ చెప్పి కళ్యాణి కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తుంది.అప్పుతో కళ్యాణం నేను అమ్మాయితో వెళ్తాను నువ్వు వెళ్తావు కదా బ్రో అని అంటాడు. సరే పో ఎప్పటికైనా నా దగ్గరికి రావాల్సిన వాడివి నువ్వు అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఒక చోటికి వెళ్దాం పద అని వెళ్తుంది.

కావ్య మీద అపర్ణ కోపం,రాజ్ నాటకాలు..
రాజ్ ఆఫీస్ కి రెడీ అయ్యి బాక్స్ రెడీ అయినా అని కిందకి దిగి అడుగుతాడు హాల్లో అందరి ముందు అడిగేటప్పటికీ కావ్య కంగారుగా ఇందాకే ముగ్గు గురించి పొగిడి ఈ కళావతికి కొమ్ములు వచ్చినట్టు ఉన్నాయి అని అనుకుంటూ మనసులో, నిన్నే అడుగుతుంది మాట్లాడవేంటి బాక్స్ రెడీయేనా అని అంటాడు. కావ్య ఏం మాట్లాడకు పోయేలోగా ఏం వాడు ఆఫీస్ కి వెళ్తాడు అని తెలుసు కదా అంత నిర్లక్ష్యమా అంటుంది అపర్ణ. వెంటనే సుభాష్ కావ్యకి లేటు కాలేదు నీ కొడుకే ముందు వచ్చాడు అని అంటాడు. ముందు వస్తే ముందే టిఫిన్ రెడీ చేయాలని తెలియదా అని అంటుంది అపర్ణ. మళ్లీ చల్లారిపోయింది అని నువ్వే కదా తిట్టేది కావ్యని అని అంటుంది ఇందిరా దేవి. వెంటనేరాజు పర్వాలేదులే మమ్మీ నేను కొంచెం త్వరగా ఆఫీస్ కి వెళ్ళాలి వెళ్తాను అని అంటాడు వెంటనే కావ్య అయ్యో అయిపోవచ్చిందండి అని అంటుంది పర్వాలేదు నువ్వు ఆఫీస్కు తీసుకెళ్ళమ్మా రాజ్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు నువ్వు బాక్స్ తీసుకొని వెళ్ళు అని అంటాడు సీతారామయ్య తనకి ఎందుకు శ్రమ అని భార్య మీద ప్రేమ చూపిస్తూ నాటకం స్టార్ట్ చేస్తాడు రాజ్ అది అపర్ణ చూసి చాలా కోపంగా రాజిని కావిని ఇద్దరిని చూస్తూ ఉంటుంది సీతారామయ్య మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. సుభాష్ కూడా బాక్స్ తీసుకెళ్ళమని కావ్యతో చెప్పడంతో ఇక అందరూ ఒకే మాట మీద ఉన్నారు కదా అనుకోని రాజ్ కూడా సరే బాక్స్ తీసుకొని ఆఫీస్ కి రా అని చెప్పి వెళ్ళిపోతాడు.

కళ్యాణి ఇంటికి తీసుకెళ్లినా అనామిక..
అనామిక తన కారుని ఒక ఇంటి ముందు ఆపి ఇదే మా ఇల్లు మా మమ్మీ డాడీ నీకు పరిచయం చేస్తాను అంటుంది ముందే చెప్తే నేను మంచిగా రెడీ అయ్యే వాడిని కదా అంటాడు కళ్యాణ్ పర్వాలేదులే ఇదేమైనా ఇంటర్వ్యూ నా పదవి లోపలికి వెళ్దాం అంటుంది అక్కడ వాళ్ళ మమ్మీ డాడీని చూపించి సుబ్రహ్మణ్యం సుబ్బు అని పిలుస్తాం మా మమ్మీ పేరు శైలజ అని వాళ్ళని పరిచయం చేస్తుంది కళ్యాణికి ఇద్దరు నమస్కారం పెట్టి పరిచయం పూర్తయిన తర్వాత కళ్యాణి నా రూమ్ కి తీసుకు వెళ్తాను నాన్న అని అంటుంది సరే అంటాడు వాళ్ళ నాన్న. రూమ్ చూద్దురుగాని రండి అని కళ్యాణి అనామిక పైకి తీసుకువెళ్తుంది ఇక కళ్యాణ్ కవితలు ఒక నాలుగు రంగు కాగితాల్లో రాసి గోడకే ప్రత్యేకంగా అతికించి ఉంటాయి కళ్యాణ్ అది చూసి మరిచిపోతూ ఉంటాడు మీ కవితలు అంటే నాకు చాలా అభిమానం మీ రాతలంటే నాకు పిచ్చి అని అనేటప్పటికి కళ్యాణ్ సిగ్గుపడుతూ ఉంటాడు ఇక పక్కనే కళ్యాణ్ ఫోటో ఒక లవ్ సింబల్ ఆకారంలో పెట్టి ఉంటుంది దానికి అడ్డంగా నిలబడి, ఏదో దాచాలి అని అనుకుంటూ ఉంటుంది అనామిక ఏంటి మీ వెనకాల ఏదో దాస్తున్నారు అని అంటాడు కళ్యాణ్ ఏం లేదండి అని అంటుంది పర్వాలేదు చూపించండి అంటాడు కళ్యాణ్.

రుద్రాణి రాహుల్ మీద కావ్యా అనుమానం..
హాల్లో అందరూ కూర్చొని ఉంటారు అది చూసి స్వప్న కనిపించట్లేదు ఏంటి అని ఇందిరా దేవి రుద్రాణి అని అడుగుతుంది ఊర్లో లేరు అని అంటుంది రుద్రాణి సింపుల్ గా ఆ మాటకు కావ్య షాక్ అవుతుంది లేరా అంత తెలిస్తే చెప్తున్నారేంటి అసలే తన కడుపుతో ఉన్న పిల్ల ఊరికి వెళ్లడమేంటి ఎప్పుడు వస్తుంది అని అంటుంది అపర్ణాదేవి. ఏమో నన్ను తెల్లవారుజాములేపి వెళ్తున్నాము అని చెప్పి వెళ్లారు మొగుడు పెళ్ళాం ఇద్దరు ఎక్కడికి అంటే హనీమూన్ కి అనుకోమన్నారు 10 రోజుల్లో వస్తారంట అని అంటుంది. ఇంట్లో గొడవలతో మేము విసిగిపోయాము అందుకే బయటకు వెళ్తాము అని రాహుల్ అడిగేసరికి సరే అన్నాను అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుంది రుద్రాణి. అయినా కోడలు నీ కొడుకుని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో నీకు తెలియదు అని ఇంట్లో అందరూ రుద్రానికి క్లాస్ పీకడం మొదలుపెడతారు. వెంటనే రుద్రాణి ఇప్పుడేంటి వాళ్ళకంటూ సరదాలు ఉండవా వాళ్ళకంటూ నచ్చినట్టు బయటకు వెళ్తే తప్ప.కడుపుతో ఉన్న పిల్ల అలా తిరగవచ్చా ఇంట్లో అందరితో కలిసి ఉన్నప్పుడు అలా సడన్గా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడమేంటి అని అంటాడు సీతారామయ్య ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు అని అంటుంది రాదేవి. సరే చెప్తాలే అంటూ పైకి లేచి వెళ్లబోతుంది రుద్రాణి అదేం సమాధానం ఫోన్ చేయి ముందు అని అంటుంది ఇందిరా దేవి కోపంగా వెంటనే ఫోన్ చేసి నాట్ రీచబుల్ వస్తుంది. సరేనా ఈసారి కలిసినప్పుడు రమ్మని చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి. అప్పుడే కావ్య వచ్చి మా అక్క ఎక్కడికి వెళ్ళింది తన మీద కోపంతో పుట్టింట్లో దించడానికి వెళ్ళారా లేదంటే తనను ఏమైనా చేస్తారా అని అంటుంది కావ్య రుద్రాణితో,రుద్రాణి అందరూ క్లాస్ పీకడం అయిపోయింది ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా వస్తారులే కంగారు ఎందుకు అని కావ్యకి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి పైకి వెళ్ళిపోతుంది ఇక కావ్య మనసులో మాత్రం ఏదో తేడాగా ఉంది అని అనిపిస్తుంది తను కూడా వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తుంది వాళ్ళ అక్క ఫోన్ కలవదు ఇక దానిలక్ష్మి వచ్చి ఏమైంది కావ్య టెన్షన్ పడుతున్నావ్ అని అంటే అక్క ఫోన్ కలవడం లేదు నాకు చాలా కంగారుగా ఉంది చిన్న అత్తయ్య అంటుంది. అయ్యో పిచ్చిదానా నువ్వు తనని అలా చూసుకుంటున్నావు కానీ తను ఏ రోజైనా నిన్ను ఒక చెల్లిలా చూసిందా, చెప్పకుండా వెళ్లడం తన తప్పు ఎక్కడికి వెళ్తుంది వస్తుందిలే నువ్వు నీ గురించి ఆలోచించుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది దాని లక్ష్మి.
రేపటి ఎపిసోడ్లో రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ వడ్డిస్తూ ఉండగా కావ్య ని కూడా నువ్వు వచ్చి కూర్చో అని అంటాడు. పర్వాలేదండి మీరందరూ తిన్న తర్వాత తింటాను అంటుంది. వడ్డించుకునేవి ఏమన్నా చాలా దూరంలో ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి కదా అందరం కలిసి పట్టించుకుందాం వచ్చి కూర్చో అని అంటాడు రాజ్. కావ్య అన్నా నీకు కూర్చోగానే తనే వడ్డిస్తాడు రాజ్ అది చూసి రుద్రాణి అపర్ణరగిలిపోతూ ఉంటారు. కావ్యకి అప్పుడే పలమారుతుంది వెంటనే రాజ్ తల మీద కొడుతూ మంచినీళ్లు తాగిస్తూ ఉంటాడు తన భార్యకి. అది చూసి అపర్ణ ఇంకాకోపంతో రగిలిపోతు కొడుకుని కోపంగా చూస్తూ ఉంటుంది.