NewsOrbit
Entertainment News సినిమా

Thalapathy 66: విజ‌య్‌-ర‌ష్మిక‌ల సినిమాకు నాగార్జున టైటిల్‌..?!

Thalapathy 66: కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దళపతి ప్ర‌స్తుతం టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లితో ఓ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ కు ఇది 66వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. `ద‌ళ‌ప‌తి 66` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ఇటీవ‌లె చెన్నైలో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా ఎంపిక అయింది.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు హై బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఓ క్రేజీ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం వంశీ పైడిప‌ల్లి `వారసుడు` అనే టైటిల్ ను పరిశీలిస్తున్నార‌ట‌.

క‌థ ప‌రంగా ఆ టైటిల్ సినిమాకు బాగా సెట్ అవుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే తెలుగు వెర్షన్ కు `వార‌సుడు` టైటిల్‌నే పెట్టి.. త‌మిళంలో వేరే టైటిల్ ను ఫిక్స్ చేయాల‌ని చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. గతంలో `వార‌సుడు` టైటిల్‌తోనే కింగ్ నాగార్జున ఓ సినిమా చేశాడు. ఇ.వి.వి.సత్యనారాయణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం 1993 లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

అయితే ఈ హిట్ టైటిల్‌నే విజ‌య్‌-ర‌ష్మిక‌ల సినిమాకు వంశీ ఖ‌రారు చేస్తారా..? లేక మ‌రో టైటిల్‌కు వెళ్తారా..? అన్న‌ది చూడాలి. కాగా, పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శరత్‌ కుమార్‌, ప్రభు, యోగిబాబు, ప్రకాష్‌ రాజ్‌, శ్రీకాంత్‌, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది చివ‌ర్లో లేదా వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ మూవీ విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

author avatar
kavya N

Related posts

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri