Devatha:రాధ ఇంట్లో ఒక్కతే ఉందని మాధవ్ కావాలని ప్లాన్ చేసి స్టిక్ ను విసిరేస్తాడు.. ఆ తర్వాత తను ఒక్కడే మెట్లు మీద నుంచి పడిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తూ కాలు నొప్పి అని అరుస్తాడు.. అది చూసినా రాధ కర్ర అందించి పైకి లేపుతుంది.. మాధవ్ కావాలని రాధ భుజం మీద చేయి వేస్తాడు.. నువ్వు ఇలాగే నాకు ఎప్పుడూ తోడుగా ఉంటే నాకు ఈ కర్రతో సహాయం అవసరం లేదు అని రాధ భుజం మీద చేయి వైపు చూస్తూ అంటాడు..
మాధవ్ తన చేతిలో ఉన్న స్టిక్‌ను సోఫాలోకి విసిరెసి తన కాలం మీద తన నిలబడి నడుస్తాడు మాధవ వైపు చూస్తుంది.. ఒక ఆడదాని మనసులో మార్గవాడు స్థానం సంపాదించుకోవాలంటే తన మీద జాలి కలిగేలా చేయాలి. అలా జాలి కలగాలంటే ఏదో ఒక లోపం ఉండాలి ఇది లోపం కాదని నీకు తెలియజేయడానికి అని మాధవులు రాదని చూస్తూ నడుస్తాడు నాలో ఏ లోపం లేదు నన్ను నువ్వు ఇష్టపడటానికి పని మాధవ్ అంటాడు మాధవిని చూసి రాధ అసహ్యించుకుంటుంది.. ఈ నిజం వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలియకుండా జాగ్రత్త పడతాడు..
భాగ్యమ్మ ను తీసుకొని రాదా ఇల్లు వెతకడానికి వెళుతుంది .ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అస్సలు ఉండకూడదు అని రాధ మనసులో అనుకుంటుంది. ఇక భాగ్యమ్మ కలిసి ఒక ఇంటికి వెళ్లి అద్దెకి ఉండటానికి కూడా డబ్బులు ఇస్తారు. చిన్నయి ఆదిత్య రుక్మిణి కలిసి ఉన్న ఫోటో చూసి షాక్ అవుతారు. ఇది పెళ్లి ఫోటో లాగా ఉంది అని అనుకుంటుంది. దేవుడమ్మను ఈ విషయం అడగాలని అనుకుంది..