Subscribe for notification

F3 Movie: `ఎఫ్ 3` అనిల్ రావిపూడికి హిట్టా?.. ఫ్లాపా?

Share

F3 Movie: టాలీవుడ్‌లో అప‌జ‌యం ఎరుగ‌ని అతి కొద్ది మంది ద‌ర్శ‌కుల్లో అనిల్ రావిపూడి ఒక‌రు. `ప‌టాస్‌` వంటి హిట్ మూవీతో డైరెక్ట‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈయ‌న.. ఆ త‌ర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక ఈయ‌న తాజా చిత్రం `ఎఫ్ 3`. `ఎఫ్ 2`కు సీక్వెల్ ఇది. ఇందులో విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించారు. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. సోనాల్ చౌహాన్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 27న రిలీజ్‌గా అయిన ఈ ఫ‌న్ ఎంట‌ర్టైన‌ర్ తొలి రోజు పాజిటివ్ టాక్‌తో సూప‌ర్ హిట్ గా నిలిచింది.

కానీ, క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఈ చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకోలేక‌పోయింది. విడుద‌లైన 16 రోజుల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 16వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 లక్షల షేర్, వరల్డ్ వైడ్ గా 18 లక్షల షేర్ ని అందుకుంది. ఇక ఏరియాల వారీగా ఎఫ్ 3 సినిమా 16 రోజుల టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 17.85 కోట్లు
సీడెడ్: 6.00 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 5.86 కోట్లు
తూర్పు: 3.34 కోట్లు
పశ్చిమ: 2.42 కోట్లు
గుంటూరు: 3.22 కోట్లు
కృష్ణ: 2.83 కోట్లు
నెల్లూరు: 1.74 కోట్లు
———————
ఏపీ+తెలంగాణ‌= రూ. 43.26 కోట్లు(రూ.69.70 కోట్లు~ గ్రాస్)
———————

క‌ర్ణాట‌క‌+రెస్ట్ ఆఫ్ ఇండియా: 2.96 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 7.07 కోట్లు
———————
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్‌= రూ.53.29కోట్లు(89.37 కోట్లు~ గ్రాస్)
———————

కాగా, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 63.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెజ్ చేసిన ఈ చిత్రం.. రూ. 64.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. అంటే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్‌గా నిల‌వాలంటే.. ఇంకా రూ. 11.21 కోట్ల షేర్‌ను వ‌సూల్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అంత భారీ టార్గెట్ అందుకోవ‌డం చాలా క‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అనిల్ రావిపూడి ఎప్ 3 ద్వారా తొలి ఫ్లాప్‌ను అందుకున్నాడ‌ని ప్ర‌చారం చేస్తున్నారు నెటిజ‌న్లు.


Share
kavya N

Recent Posts

Thaman: ఇండస్ట్రీలో ఆ ఇద్దరి హీరోలకు మ్యూజిక్ కొట్టడం చాలా కష్టం అంటున్న తమన్..!!

Thaman: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకేక్కుతున్న చాలా ప్రతిష్టాత్మక చిత్రాలకి తమన్(Thaman) యే మ్యూజిక్ డైరెక్టర్. 2020 త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో…

22 mins ago

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

1 hour ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

2 hours ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

3 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

4 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

5 hours ago