33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

మంచు విష్ణు `జిన్నా` టీజ‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే?

Share

గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న మంచు విష్ణు.. ప్ర‌స్తుతం `జిన్నా` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లు న‌టిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్‌లో విడుద‌ల అయ్యేందుకు ముస్తాబవుతోంది. ఇక‌పోతే ఈ సినిమాను అనౌన్స్ చేసిన నాటి నుంచి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. తాజాగా `జిన్నా` టీజర్ ని బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ టీజ‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంటోంది.

ఇందులో టెంట్ హౌజ్‌కు ఓన‌ర్ గాలి నాగేశ్వ‌ర‌రావుగా మంచు విష్ణు ఈ చిత్రంలో క‌నిపించ‌నున్నాడు. అయితే అత‌డికి ఎప్పుడూ బ్యాడ్ టైమ్ న‌డుస్తూనే ఉంటుంది. ఏ ప‌ని చేయ‌కుండా.. ఊరంత అప్పులు చేస్తూ గ‌డుపుతున్నా విష్ణు లైఫ్‌లోకి సన్నీలియోని ఎంట్రీ ఇస్తుంది.

ఆమె రాకతో జిన్నా టైం స్టార్ట్ అయిందని అనుకుంటుండగా.. సన్నీలియోన్ శరీరంలోకి ఓ ఆత్మ ప్రవేశించినట్లు టీజర్ లో చూపించారు. మొత్తానికి ఇదో యాక్షన్ థ్రిల్ల‌ర్‌ ఎంటర్టైనర్ అని టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. ఆక‌ట్టుకుంటున్న ఈ టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను విష్ణు ఎంత వ‌ర‌కు అందుకుంటాడో చూడాలి.


Share

Related posts

తన ఫస్ట్ లవ్ ఎప్పుడో బయటపెట్టిన మెగాస్టార్ చిరంజీవి..!!

sekhar

Kiara Advani: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పై పొగడ్తల వర్షం కురిపించిన కియారా..!!

sekhar

Unstoppable 2: “అన్ స్టాపబుల్ 2″లో చిరంజీవి రాకపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు..!!

sekhar