NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu November 14Today Episode: మహేంద్ర, జగతిలకు కౌంట్ డౌన్ స్టార్ట్… ఆట మొదలెట్టిన రిషి..!

Guppedantha Manasu November 14Today Episode:  బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 14వ తేదీ Guppedantha Manasu సీరియల్ 607 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం..ఈరోజు గుప్పెడంత మనసు నేటి కథనం చాలా ఉత్కంఠగా సాగిందనే చెప్పాలి. ఎందుకంటే రిషి..చెప్పాపెట్టకుండా వసుని తీసుకుని గౌతమ్ ఇంటికి వెళ్తాడు.. అక్కడ ఉన్న మహేంద్ర, జగతిని చూస్తాడా లేదా అనే ఆసక్తి అందరిలో ఉంది.

గౌతమ్ ఇంటికి వెళ్లిన వసు, రిషిలు :

Rishi go to gowtham house

ఇక ఈరోజు ఎపిసోడ్ యొక్క హై లెట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం..వసు యూనివర్శిటి ఫస్ట్ రావడంతో అందరు హ్యాపీగా ఉంటారు కానీ రిషి మాత్రం డాడ్ అంత కోపంగా నా మీద ఎందుకు ఉన్నారు. కనీసం మీ మేడమ్ అయినా తనకు నచ్చజెప్పి నా దగ్గరకు తీసుకుని రావచ్చుకదా?’ అంటూ వసుతోనే చెప్పుకుని బాధపతాడు. ‘మహేంద్ర సార్ మీరు రిషి సార్‌ని చాలా బాధపెడుతున్నారు.. త్వరగా వచ్చేయొచ్చు కదా’ అనుకుంటుంది వసు మనసులో త్వరగా రమ్మనమని జగతీ వాళ్లకి మెయిల్ చేస్తుంది.

భర్త రాకతో దేవయానిలో మొదలైన కంగారు :

Devayani tension

సీన్ కట్ చేస్తే దేవయాని ఇంట్లో కూర్చుని కోపంతో రగిలిపోతుంది. ఆయన వచ్చేస్తున్నారు ఇప్పుడు మహేంద్ర వాళ్ళ గురించి అడిగితే ఏమి చేయాలి అని కంగారు పడుతూంటుంద. రిషికి నేను మీ పెదనాన్న పోలీస్ కంప్లైంట్ వద్దు అన్నారని.. అలా అన్నారు ఇలా అన్నారు అని ఎన్నో అబద్దాలు చెప్పాను.. ఆయన వచ్చిన తర్వాత జగతీ వాళ్లు వెళ్లిపోవడానికి కారణం నేనే అనుకుంటారేమో? ఏం చెయ్యాలి? ఎలా కవర్ చెయ్యాలి?’ అంటూ తనలో తనే ఆలోచిస్తూ ఉంటుంది.

రిషిని చూసి దాక్కున మహేంద్ర :

Mahendra esacape

మరోవైపు మహేంద్ర, జగతీలు హాల్లో కూర్చుని మెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఇంటి బయట రిషి కారు ఆగుతుంది. వసు, రిషీలు కారు దిగి ఇంటి వైపు నడిచి వస్తుంటే జగతీ, మహేంద్రలు వాళ్ళను చూసి షాక్ అవుతారు వెంటనే గౌతమ్‌కి కాల్ చేసి.. ‘రిషి వాళ్లు ఇంటికి వచ్చారు’ అని చెప్పి పైకి పరుగుతీస్తారు. ‘అంకుల్ మీరు దాక్కోండి.. నేను దగ్గరల్లోనే ఉన్నాను వచ్చేస్తాను’ అంటూ వేగంగా బయలుదేరతాడు గౌతమ్.

కవర్ చేసిన గౌతమ్ :

Gowtha covers

ఇక రిషి ఇంటితలుపులు తీసి ఉండటంతో గౌతమ్ ఇంట్లోనే ఉన్నాడనుకుని డైరెక్ట్‌ గా లోపలికి వెళ్ళి గౌతమ్ అంటూ పిలుస్తూ ఉంటారు రిషి, వసూలు. వసు కూడా గౌత ఎక్కడా లేకపోవడంతో పైకి వెళ్దాం సార్ అంటుంది. సరిగ్గా అప్పుడే జగతీ, మహేంద్ర మెట్ల దగ్గర్లో ఉంటారు. వెంటనే పరుగున ఆ పక్కనే ఉన్న గదిలోకి వెళ్తారు. తలుపు వెనుక దాక్కుంటారు. ఇంతలో గౌతమ్ కారు వచ్చి ఆగుతుంది. రిషి పైన కూడా అటు ఇటు చూసి గౌతమ్‌కి కాల్ చేస్తాడు. గౌతమ్ కావాలనే లిఫ్ట్ చేయడు. పరుగున వస్తూ ఉంటాడు. ఇంతలో రిషి.. మహేంద్ర, జగతీలు వెళ్లిన గదిలోకి వెళ్లి చూద్దాం అని తలుపు దాకా వెళ్లిపోతాడు. అప్పుడే గౌతమ్ వచ్చి రేయ్ రిషీ అంటాడు.

పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్నా రిషి :

రిషి తలుపు తీయడం ఆపేసి వెనక్కి వెళ్లిపోతాడు. ఆ పక్కనే ఉన్న మహేంద్ర, జగతీలు ఊపిరి పీల్చుకుంటారు. ‘ఏంట్రా ఇలా వచ్చారు’ అంటాడు గౌతమ్ కంగారు పడతూ. ‘నీకోసమేరా.. అయినా తలుపు వేయకుండా ఎక్కడికి వెళ్లావ్ రా?’ అంటాడు ఇస్తీకి బట్టలు ఇవ్వడానికి వెళ్లాను.. దగ్గరే కదా అని తలుపు వేయడం మరిచిపోయాను’ అంటూ ఏదో కవర్ చేస్తాడు. ‘సరేలే పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం పదా అంటాడు రిషి. ‘రేయ్ స్టేషన్ ఎందుకు రా’ అంటాడు గౌతమ్ కంగారుగా.డాడ్ వాళ్లు రావట్లేదు కదా.? పైగా పెదనాన్న కూడా ఊరు నుంచి వస్తున్నారు. నాకే ఇంత బాధగా ఉందంటే ఆయన ఇంకా ఎక్కువ బాధపడతారు కదా.వెంటనే పోలీసులకు చెబితే వాళ్లే డాడ్ వాళ్లని తీసుకొస్తారు’ అంటాడు రిషి.వద్దురా ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే పరువు పోతుందిరా.. ఇది ఇంటి సమస్య కదరా.? ఆలోచించు.. రెండు రోజులు ఆగు.. పెదనాన్నగారు వస్తున్న విషయం మీ డాడ్‌కి మెయిల్ చెయ్ అప్పుడే ఆలోచిద్దాం’ అంటూ సర్దిచెప్పి కూల్ చేస్తాడు.‘డాడ్ వాళ్లు ఎందుకు వెళ్లారో తెలియదు. ఎప్పుడు వస్తారో తెలియదు. అయినా సరే నువ్వు చెప్పావనే రెండు రోజులు గడువు పెడుతున్నాను.. రెండు రోజుల్లో వాళ్ల రాకుంటే పోలీసుల్ని కలుస్తాను’ అంటాడు.

జగతి ఆవేశం.. మహేంద్ర పోరాటం :

Jagathi serious

వరిషి వాళ్ళు వెళ్ళగానే బయటికి వస్తారు మహేంద్ర, జగతీలు. అంకుల్ ఏమి చేద్దాం అంటాడు గౌతమ్ చాలా అసహనంగా.. జగతీ అక్కడే కూర్చుని రిషి మాటల్ని తలుచుకుని అల్లాడిపోతుంది. ఆవేశంగా పైకి లేచి ఇక చాలు మహేంద్రా.. ఇప్పటి దాకా జరిగింది చాలు. నువ్వు ఏదో అనుకుని వచ్చావ్. నీ మాటల్ని నీ ఆలోచనల్ని నేను గౌరవించాను.. కానీ ఇక నావల్ల కావట్లేదు మహేంద్ర.. అన్నీ ఆపేసి వెళ్లిపోదాం పదా అంటుంది జగతీ. అది కాదు జగతి మంచి జరగాలంటే.. ఓర్పు చాలా అవసరం.. రాత్రికి రాత్రి అయిపోవాలంటే ఎలా?’ అంటాడు మహేంద్ర.
ఇంకా ఏం కావాలి మహేంద్ర.. రిషికి బంధాల మీద నమ్మకం పోయేదాకా ఒంటరిని చేసి ఆడించటమేనా నీ ఓర్పు? దేవయాని అక్కయ్యకు రిషిని వదిలేసి.. ఇంకెన్ని రోజులు రిషిని శిక్షిద్దాం చెప్పు అంటుంది జగతీ కోపంగా. మేడమ్ చెప్పేది కరెక్ట్ అంకుల్ ఆలోచించండి అంటాడు గౌతమ్.ఇంతలో మహేంద్ర
ఏంటి గౌతమ్.. సలహాలు ఇస్తున్నావా? లేక మీ స్నేహం చెడిపోతుందని భయపడుతున్నావా అంటాడు మహేంద్ర అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri