NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

Jagadhatri Today Episode April 19 2024 Episode 209 highlights

Jagadhatri April 19 2024 Episode 209: జగదాత్రి కిరణ్ కు ఫోన్ చేసి వీడియో పంపించమని అడుగుతుంది. ఏమైంది ధాత్రి అని కేదార్ అడుగుతాడు. కిరణ్ ఇప్పుడే ఫోన్ పోగొట్టుకున్నాడంట అని జగదాత్రి చెబుతుంది. ఇప్పుడు మినిస్టర్ కి 50 కోట్లు ఇచ్చి ఛానల్ ని పరువు ని కాపాడుకోవడం తప్ప వేరే మార్గం కనిపించట్లేదు జగదాత్రి అని కౌశికి అంటుంది. అలా చేస్తే మనం తప్పు ను ఒప్పుకున్నట్టు అవుతుంది వదిన నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 19 2024 Episode 209 highlights
Jagadhatri Today Episode April 19 2024 Episode 209 highlights

కౌశికి జగదాత్రికి ఆఫీస్ కి బయలుదేరుతారు. వాళ్లని ఫాలో అవుతూ వెనకాల వస్తూ ఉంటాడు యువరాజ్. వాళ్లు చానల్లోకి వెళ్తారు. అసలు వీళ్ళు ఛానల్ దగ్గరికి ఎందుకు వచ్చారు ఏం చేయాలనుకుంటున్నారు అని యువరజ్ చాటుగా వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. నా చానల్లో తప్పు జరిగింది అంటే నేను నమ్మలేకపోతున్నాను నా కుటుంబం లాంటి ఈ ఛానల్లో నాకు ఎంతో మంది నమ్మకస్తులు ఉన్నారు అనుకున్నాను కానీ ఇలా నన్నే మోసం చేస్తారని అనుకోలేదు ఇంత పెద్ద వజ్ర పార్టీ ఇండస్ట్రీని నడుపుతున్నాను అంటే నా ఒక్కదాని వల్ల కాదు మీ అందరి సహాయంతో నడుపుతున్నాను కానీ తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కావట్లేదు అని కౌశికి అంటుంది. వదిన మేము అందరితో ఒకసారి మాట్లాడొచ్చా అని జగదాత్రి అంటుంది. జగదాత్రి కేదార్ వాళ్ళందరినీ వరుసగా చూస్తూ వెళుతూ ఉంటారు. కేదార్ రంగనాథ్ దగ్గరికి వెళ్లి హార్డ్ డిస్క్ మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా అని అడుగుతాడు. లేదు సార్ నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడ పెట్టలేదు నా పాకెట్ లోనే పెట్టుకొని వచ్చాను అని రంగనాథ్ చెబుతాడు. హార్డ్ డిస్క్ ఎవరికి ఇచ్చారు అని జగదాత్రి అడుగుతుంది.భూషణ్ కి ఇచ్చాను మేడం నేను టెలికాస్ట్ చేయడానికి వెళ్లాను అని రంగనాథ్ చెబుతాడు. భూషణ్ నువ్వు హార్డ్ డిస్క్ ఎక్కడైనా పెట్టడం కానీ ఎటైనా వెళ్లడం కానీ జరిగిందా అని జగదాత్రి అడుగుతుంది. లేదు మేడం నేను సిస్టం ముందే కూర్చున్నాను అని భూషణ్ అంటాడు. నీ పేరేంటి అని వేరే అతని అడుగుతుంది జగదాత్రి. అతను ఒళ్లంతా చెమటలు పట్టి తుడుచుకుంటూ భయంగా నా పేరు విజయ్ అని చెబుతాడు. వదిన ఒకసారి సీసీటీవీ ఫుటేజీ చూడొచ్చా అని జగదాత్రి అడుగుతుంది. సీసీటీవీ ఫుటేజీ చూసి అందులో విజయ్ టెన్షన్ గా కంగారుగా కనపడతాడు ఇందరిలో ఒక విజయ్ కి చెమటలు ఎందుకు పడుతున్నాయి హార్డ్ డిస్క్ విజయన్న కొట్టేయాలి లేదంటే  ఎవరికైనా సహాయమైనా చేయాలి అని అని జగదాత్రి అంటుంది. అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం ఎంక్వైరీ మొదలు పెట్టారని భాయ్ కి చెప్పాలి అని యువరాజ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 19 2024 Episode 209 highlights
Jagadhatri Today Episode April 19 2024 Episode 209 highlights

వదిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూసాం కానీ ఆ వీడియో టెలికాస్ట్ అయ్యే పది నిమిషాల ముందు ఫుటేజీ మిస్ అయింది అప్పుడే కరెంటు పోయింది అని జగదాత్రి అంటుంది. కానీ విజయ్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అక్క అని కేదార్ అంటాడు. అయితే పిలిచి అడుగుదాం అని కౌశికి అంటుంది. వద్దక్క అలా చేస్తే అతను జాగ్రత్త పడతాడు మనకు వీడియో ఎలా మిస్ అయిందో కాదు కావాల్సింది హార్డ్ డిస్క్ దొరికితేనే మనం తప్పు చేయలేదని ప్రూఫ్ చేసుకోగలం అని కేదార్ అంటాడు. అయితే ఇంటికి వెళ్దాం పదండి అని కౌశికి జగదాత్రి వాళ్ళు ఇంటికి వెళ్లి పోతారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 19 2024 Episode 209 highlights
Jagadhatri Today Episode April 19 2024 Episode 209 highlights

ఏంటి అత్తయ్య ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అని నిషిక అడుగుతుంది.మినిస్టర్ గారు 50 కోట్లు అడిగాడంట ల్యాండ్ అమ్మి ఇస్తారంట అని వైజయంతి అంటుంది. మనం మంచి చెపితే సలహాలు పనికిరాక వేరే వాళ్ళ సలహా తీసుకుంటే ఇప్పుడేమైందో చూడు అసలుకే మోసం వచ్చింది అని నిషిక అంటుంది. ఇంతలో ల్యాండ్ కొనేవాళ్ళు అక్కడికి వస్తారు.  సార్ సిటీ అవతల మాకు పది ఎకరాలు ల్యాండ్ ఉంది అది అమ్మేయాలనుకుంటున్నాం అని కౌశికి అంటుంది. మాకు ఆ ల్యాండ్ అక్కర్లేదు గచ్చిబొలిలో ఉన్న మూడు ఎకరాల ల్యాండ్ మాకు కావాలి అని వాళ్ళు అడుగుతారు. గచ్చిబోలిలో ఉన్న ల్యాండు మాధురి పెళ్లి కోసం దాసిపెట్టింది కదా అని వైజయంతి అంటుంది. అవునత్తయ్య అని నిషిక అంటుంది. ఆ ల్యాండ్ అమ్మడం కుదరదండి వేరే వాళ్లకి ఇస్తామని మాటిచ్చాము అది తప్ప ఇంకేదైనా అడగండి అని జగదాత్రి అంటుంది. లేదు మేడం మేము దాని కోసమే వచ్చాము మాకు ఏ ల్యాండ్ అక్కర్లేదు అని వాళ్ళు అంటారు. అయితే మీకు ఆ ల్యాండ్ అమ్ముతాను అని కౌశికి అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ కౌశికి అది మాధురి పెళ్లి కోసం అఖిలాండేశ్వరికి ఇస్తానన్న ల్యాండ్ అది ఇవ్వకపోతే పెళ్లి ఆపేస్తారు అని వైజయంతి అంటుంది.

Jagadhatri Today Episode April 19 2024 Episode 209 highlights
Jagadhatri Today Episode April 19 2024 Episode 209 highlights

బావ నువ్వైనా చెప్పొచ్చు కదా అని వైజయంతి అంటుంది. కౌశికి ఒక్కరితో చెప్పించుకునేస్థితికి దిగజారలేదు తను ఏం చేసినా మంచే చేస్తుంది అని సుధాకర్ అంటాడు. పిన్ని మాధురి పెళ్లి నేను ఘనంగా చేస్తాను నువ్వేమీ బాధపడకు అఖిలాండేశ్వరానికి నేను సమాధానం చెప్తాను అని కౌశికి అంటుంది. ఏంటి బావా నువ్వేమీ మాట్లాడవు మాధురి పెళ్లి ఆగిపోతుంది అని వైజయంతి అంటుంది.అత్తయ్య అలా ఏమీజరగదు ఆ పెళ్లి ఆగకుండా చేసే బాధ్యత మాది అని జగదాత్రి అంటుంది.కౌశికి మాట ఇచ్చింది అంటే అది నిలబెట్టుకొని తీరుతుంది ఇంక నువ్వేం మాట్లాడకు వైజయంతి అని సుధాకర్ అంటాడు. వచ్చినవాళ్లు అడ్వాన్స్ ఇచ్చిరిజిస్ట్రేషన్ రెండు రోజుల్లో పెట్టుకుందాం అంటూ వెళ్ళిపోతారు. బావ పెద్ద తప్పు జరుగుతుంది మాధురి పెళ్లి గనక ఆగిపోతే అప్పుడు నేను మాత్రం ఊరుకోను అంటూ వై జయంతి వెళ్ళిపోతుంది. బాబాయ్ మాధురి పెళ్లి అంగరంగ  వైభవంగా ఏ మాట రాకుండా నేను చేస్తాను అని కౌశికి అంటుంది. నా కూతురు మాట నిలబెట్టుకుంటుంది నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించకు కౌశికి మీ పిన్నికి నేను నచ్చ చెప్తాను అని సుధాకర్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 19 2024 Episode 209 highlights
Jagadhatri Today Episode April 19 2024 Episode 209 highlights

నిషిక దివ్యాంక కి ఫోన్ చేస్తుంది. ఏంటి నిషిక ఈ పాత ఫ్రెండ్ ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా అని దివ్యాంక అంటుంది. అదేమీ లేదు దివ్యాంక మా ఇంట్లో ఏదో జరిగిపోతుంది మా వదినని సీఈఓ పదవి నుంచి దించే అవకాశం వచ్చింది అని నిషి అంటుంది. నువ్వు ఆ పని చెయ్యి నిషి నిన్ను సీఈఓ పదవిలో కూర్చోబెట్టి గ్రాండ్ గా చేస్తాను అని దివ్యాంక అంటుంది. నాకు ఒక చిన్న సహాయం చేయాలి దివ్యాంక మా వదిన అఖిలాండేశ్వరి కి ఇస్తానన్న ల్యాండ్ వేరే వాళ్ళకి బేరం పెట్టింది నువ్వు ఈ విషయాన్ని అటు చేరవేస్తే చాలు అని నిషిక అంటుంది. సరే నిషి నేను చెప్తాను అని దివ్యాంక అంటుంది. అఖిలాండేశ్వరి కి ఫోన్ చేస్తే బాగోదని భవానికి ఫోన్ చేస్తుంది దివ్యాంక. ఎవరు మీరు అని భవాని అడుగుతుంది. నేనెవరు అనేది పాయింట్ కాదు మీకు మేలు జరిగే విషయం చెబుతాను ఆగిపోయిన నీ కొడుకు ఎంగేజ్మెంట్ జరిపించడానికి వజ్రపాటి కౌశికి తన చెల్లెల్ని ఇచ్చి  మీకు ఇస్తానన్న ల్యాండ్ వేరే వాళ్లకు బేరం పెట్టిందట నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది అని దివ్యాంక అంటుంది..

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N