కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన తాజా చిత్రం `సర్దార్`. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, రజిష విజయన్ హీరోయిన్లుగా నటించారు. తండ్రి కొడుకులగా కార్తి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ స్పై థ్రిల్లర్ దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 21న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది.
అయితే రెండు భాషల్లోనూ ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. తండ్రి కొడుకులుగా కార్తి తనదైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. బలమైన భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్, కార్తి యాక్టింగ్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలుచాయి. మొత్తానికి టాక్ అనుకూలంగా ఉండటంతో కార్తి బాక్సాఫీస్ వద్ద తొలిరోజు బాగానే వసూళ్లను రాబట్టాడు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 0.96 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. అలాగే తమిళంలో రూ. 3.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ. 7 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా సర్దార్ కలెక్షన్స్ ఓసారి గమనిస్తే..
నైజాం- 0.38 కోట్లు
సీడెడ్- 0.11 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.18 కోట్లు
ఈస్ట్+వెస్ట్- 0.11 కోట్లు
కృష్ణా + గుంటూరు- 0.12 కోట్లు
నెల్లూరు- 0.06 కోట్లు
————————————
ఏపి+ తెలంగాణ= 0.96 కోట్లు
————————————
కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 4.59 కోట్ల రేంజ్ లో థియేటర్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ చిత్రం రూ. 4.9 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది. అయితే మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ.3.94 కోట్ల షేర్ ను వసూల్ చేస్తే తెలుగులో ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలుస్తుంది.