Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో, కృష్ణ వాళ్ల పిన్నితో ముకుందా గొడవ పడుతుంది. కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని అవమానిస్తుంది. ఇవన్నీ కృష్ణ కి నచ్చక ముకుంద కి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఎలాగైనా మురారితో బయటికి వెళ్లాలని కృష్ణ అనుకుంటుంది కానీ ఆ ప్లాన్ ని కూడా ముకుంద చెడగొట్టి తనే మురారితో బయటకు వెళ్తుంది.

ఈరోజు 281 వ ఎపిసోడ్ లో,ముకుంద ఎక్కడికి వెళ్లిందని అలేఖ్యని అడుగుతారు రేవతి మధు కృష్ణ ముగ్గురు కానీ అలేఖ్య మాత్రం మాట దాటేసి నాకేం తెలియదు అని చెప్తుంది కానీ ఎవరు నమ్మరు. ముకుంద ఎక్కడికి వెళ్లిందో నీకు తెలియకుండా ఎవరికి తెలుస్తుంది అంటాడు మధు, నాకెలా తెలుస్తుంది ముకుంద ఎక్కడికి వెళ్లిందో అని అంటుంది అలేఖ్య ఎందుకంటే నువ్వు ముకుంద చెంచాడు కదా అందుకని అంటాడు, ఇద్దరు గొడవ పడుతూ ఉంటే రేవతి మీరు ఎప్పుడు తండుకుంటూనే ఉంటారో ఒక్కరోజు కూడా గొడవ పడకుండా ఉండలేరా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.ముకుంద, మురారి ఇద్దరు ఇంటికి వస్తారు.

ఆదర్శ్ గురించి చెప్పిన మురారి..
అప్పటికే భవానీ దేవి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.అక్కడికి వచ్చిన రేవతి కృష్ణ ఇద్దరు ఎవరికోసం భవానీ దేవి ఎదురుచూస్తుంది అని అనుకుంటారు. రేవతి అక్కయ్య పూజకి ఏర్పాట్లు చేయాలి కదా మీరు ఊరికి వెళ్తా అన్నారు ఎప్పుడు వెళ్ళేది అంటుంది ఈరోజే అంటుంది భవానీ దేవి, ఈ మురారి ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటూ ఉండగా అక్కడికి అప్పుడే వస్తారు వాళ్ళు,వెళ్లిన పని ఏమైంది అని అడిగితే మురారి ముందు సైలెంట్ గా ఉంటాడు తర్వాత ముకుంద ఎక్కడ రా అని అంటుంది భవానీ దేవి అప్పుడే ముకుంద లోపలికి వస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్లారు అన్న విషయం మధుకి కృష్ణకి అర్థం అవుతుంది. ఇక భవానీ దేవి మురారితో ఏమైందో చెప్పు ఆదర్శ్ గురించి ఏమన్నా తెలిసిందా అని అడుగుతుంది వెంటనే మురారి మొన్ననే ఆదర్శ కానన్ గారితో కలిశారంటమ్మా ఈ సైనిక్పూర్ లో ఉండే ఆయన కన్నన్ గారు మంచి స్నేహితులతో వీళ్ళిద్దరూ ఆదర్శకి నచ్చ చెబుదాం అనుకుంటే నాకు కొంత టైం కావాలి అని అన్నాడు ట,అని చెప్తాడు.అంటే ఆదర్శ్ ఆలోచనలు పడ్డాడు కచ్చితంగా తిరిగి వస్తాడు. ఈ మాత్రం సంతోషకరమైన విషయం చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటుంది భవానీ దేవి ఇక ఇంట్లో రేవతి కృష్ణ అందరూ సంతోషపడతారు కానీ ముకుంద మాత్రం డల్లుగా అలానే ఉంటుంది. ఇక వినాయకుడి పూజకి ఏర్పాట్లు చేయాలి కదా పద వెళ్దాం కృష్ణ అని తీసుకొని రేవతి వెళ్తుంది. మురారి కృష్ణ కి అసలు ఎందుకు బయటికి వెళ్లాల్సి వచ్చిందో చెబుదాం అనుకునే లోపే కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మధు మురారితో నువ్వు ముకుందని తీసుకొని వెళ్ళావా అని అంటాడు లేదు తనే కావాలని పట్టుబట్టి నాతో వచ్చింది అని చెప్తాడు.

ప్రభాకర్ హడావిడి..ముకుంద మీద అనుమానం..
ఇక ప్రభాకర్ వినాయకుడి బొమ్మ తీసుకొని వస్తాడు.మధువినాయకుడి బొమ్మ వచ్చేసింది అందరూ రండి అని చెప్పి పిలుస్తాడు ఇక అందరూ కిందకి వస్తారు. ధూమ్ ధామ్ గా డాన్స్ చేసుకుంటూ ప్రభాకర్ బొమ్మను తీసుకొని వస్తాడు అది చూసి ఇంత పెద్ద బొమ్మ ఎందుకు తీసుకొచ్చారు అంటుంది భవాని దేవి. మన ఇంట్లో పండగ అంటే ఎలా ఉండాలి చేపల అమ్మను, సైకిల్ అమ్మాను ఏ నమ్మినా కానీ ఇంత పెద్ద బొమ్మ తీసుకొచ్చి చేసుకోవడం మాకు అలవాటు అసలు వినాయకుడి పండుగ అంటే ఎంత బొమ్మతోనే చేసుకోవాలి అంటాడు ప్రభాకర్, సరే అంటుంది భవాని దేవి మీరంతా వెళ్లి రెడీ అయి రండి అని అంటుంది ఈ లోపు కృష్ణకి నిజం చెప్పాలని మురారి ట్రై చేస్తూ ఉంటాడు అది చూసి ప్రభాకరు వీళ్లిద్దరూ బానే ఉన్నారు కదా మరి అల్లుడు ముకుందతో ఏంటి అని అనుకుంటాడు, అంటే ఈ ముకుంద బిడ్డ తేడా అన్నమాట అనుకుంటాడు.
Krishna Mukunda Murari: ముకుంద గురించి ఆలోచించాలి అనుకున్న ప్రభాకర్.. కృష్ణతోముకుంద గొడవలు.

ముకుంద కి సవాల్ చేసిన కృష్ణ..
ఇక భవానీ దేవి లోపలికి వెళ్లిపోయిన తర్వాత ముకుంద కూడా వెళ్తుంటే ప్రభాకర్ పిలిచి ముకుందా నీతో ఒక విషయం మాట్లాడాలి అమ్మాయి ఇటు రా అంటారు. ముకుంద ఏంటో చెప్పండి అని అంటుంది నన్ను ఇంకా అలా పిలవకుండా బాబాయి అని పిలువమ్మా అంటాడు సరే అంట అంటుంది ముకుంద చెప్పండి బాబాయ్ అని అంటుంది. ఏం లేదు బేటా? పండగ అంటే అందరం కలిసి చేసుకోవాలి కదా మీ నాన్నగారు కూడా పండక్కి వస్తే బాగుంటుందని మీ బాబుని పిలువు అని అంటాడు ప్రభాకర్, అవసరం లేదు నేను పిలవను అంటుంది ముకుందా అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు, రేవతి అన్నయ్య గారు వద్దంటుంది కదా వదిలేయండి తనకి ఇష్టం లేదేమో పిలవడం ఉంటుంది లేత చెల్లెమ్మ పండగ అంటే ఎలా ఉండాలి ధూమ్ ధామ్ గా చేస్తాము ఈ పండక్కి మనవాళ్ళు లేకపోతే ఏం బాగుంటుంది. అందుకనే వాళ్ళ నాన్న పిలవమంటున్నాను అని అంటే ముకుంద నేను పిలవను. అయినా మా నాన్నతో మీకేంటి పని అని మీరు పండక్కి వచ్చారు పండగ చేసుకుని వెళ్ళండి అని అంటుంది. కృష్ణ వాళ్ళు ఎప్పుడు వెళ్లాలో వాళ్లకు తెలుసు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అయినా వాళ్లు మీ నాన్నగారిని అదే బాబాయ్ గారిని పిలవమన్నారు కదా పిలవచ్చు కదా అని అంటుంది నేను చచ్చిన పిలవను అని అంటుంది చస్తే ఏం పిలుస్తావులే బతికుండగానే పిలుస్తావు అని అంటుంది. అంటే అని అంటుంది ముకుందా అంటే ఏం లేదు ముకుందా? ఈరోజు నీ అంతటి నువ్వే మీ నాన్నకి ఫోన్ చేసి నాన్న ఇక్కడికి రండి అని పిలిచేలా చేస్తాను అని రేవతి మురారి మధు అందరి ముందు సవాల్ చేస్తుంది కృష్ణ, ఏంటి కృష్ణ నువ్వు పిలవడం ఆయన వచ్చినట్టే మీరు అనుకొని సంబరపడిపోతున్నారా నేను ఒకసారి అనుకుంటే పిలవను అని పిలవను అని అంటుంది. చూద్దాం ముకుందా ఎలా పిలవు కచ్చితంగా పిలుస్తావు అని అంటుంది ముకుంద కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక పండక్కి ఏర్పాట్లు చేద్దాం చిన్నన్న అని అందరూ పండగ ఏర్పాట్లలో హడావిడిగా ఉంటారు.

వినాయక చవితి పూజ..
పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తారు ప్రభాకర్ వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత అందరూ రెడీ అయ్యే కిందకి వస్తారు. ఇక అన్ని బానే చేశారు అని అంటుంది కానీ మీరు ఒకటి మర్చిపోయారండి అని అంటుంది శకుంతల ప్రభాకర్ నేనా ఏం మర్చిపోయాను అన్ని సవ్యంగానే చేశాను కదా అని అంటాడు లేదు ఒకసారి యాది తెచ్చుకోండి మీరు పంతులుగా అని పిలవడం మర్చిపోయారు అని అంటుంది. వెంటనే మురారి నేను వెళ్లి పంతులు గారిని పిలుసుకొస్తాను మావయ్య అని అంటాడు అక్కర్లేదు బాబు అంటాడు ప్రభాకర్ ఇక మధు అయితే పంతులుకి ఫోన్ చేద్దామా అంటాడు అవసరం లేదు అంటాడు ప్రభాకర్ మరి ఇప్పుడు పూజ ఎవరు జరిపిస్తారండి అని అంటే పంతులు ఇక్కడే ఉంది కదా అని అంటాడు ప్రభాకర్. ఇక్కడ ఎవరున్నారా అని చెప్పి అందరూ వెతుకుతూ ఉంటారు మీ అందరికీ అర్థం కాలేదు కదా మా కృష్ణుని పంతులమ్మ అని అంటాడు ప్రభాకర్ ఏంటి బాబాయ్ మీరు అనేది అంటుంది అవును నువ్వు రెండో తరగతిలో ఉన్నప్పుడే మీ నాన్న ఊర్లో కూర్చొని కథ చదివే దానివి ఇప్పుడు ఎందుకు చేయించలేవు పూజ అని ఒక టవల్ తీసుకొచ్చి కృష్ణ మెడలో వేసి నువ్వే పంతులువి అని అంటాడు. ఇక అందరూ సరే అని పూజ చేయడానికి మొదలు పెడతారు. కృష్ణ అందరి చేత పూజ చేయిస్తూ ఉంటుంది పూలు వేయండి దన్నం పెట్టుకోండి అని పంతులుగారు చేయించినట్టే కృష్ణ పూజ చేయిస్తూ ఉంటుంది. అక్కడే కృష్ణ కి ముకుందతో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెబుదామని మురారి అనుకుంటాడు కానీ ముకుందా మధ్యలో అడ్డుపడి చెప్పకుండా చేస్తుంది. కృష్ణ నువ్వు మా నాన్నను తీసుకొస్తానని అందరి ముందు సవాల్ చేశావు కదా ఇప్పుడు నేను సవాల్ చేస్తున్నాను నీకు ఈ పూజ లో మీరు ఊహించండి చేస్తాను అని అంటుంది.

రేపటి ఎపిసోడ్ లో,అందరూ వారి వారి కోరికల్ని ఒక పేపర్ మీద రాసి ఈ బౌల్లో వేయండి ఆ కోరికలన్నీ పెద్దత్తయ్య మనకి చదివి వినిపిస్తుంది మీ పేర్లు కూడా ఆ చీటీలో రాయండి అని అంటుంది కృష్ణ సరే అని అందరూ వారి కోరికల్ని చీటీలో రాసి వాళ్ళ పేర్లు రాసి అందులో వేస్తారు ఫస్ట్ మురారి పేరు వస్తుంది మేమిద్దరం సంతోషంగా ఉండాలి అని రాసి ఉంటుంది అది భవానీ దేవి పైకి చదువుతుంది ఇక అందరూ చప్పట్లు కొట్టి ప్రభాకర్ శభాష్ అల్లుడు అంటే కృష్ణ సిగ్గుపడుతుంది ఇక మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు నెక్స్ట్ ముకుంద పేరు వస్తుంది. ఇప్పుడు చూడండి మీ అందరికీ పెద్ద బాంబే వెళ్తుంది అని ముకుందా మనసులో అనుకుంటుంది. భవానీ దేవి ఆ పేపర్ ని ఓపెన్ చేసి ఉంటుంది అందులో మురారినే నాకు భర్తగా కావాలి అని రాసి ఉంటుంది అది భవానీ దేవి పైకి చదువుతుందా లేక మార్చి చదువుతుందా తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే.