Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో కృష్ణ బాబాయ్ లాగా ప్రభాకర్ ఎంట్రీ ఇస్తాడు. ఇక వస్తూ వస్తూనే ప్రభాకర్ ముకుందకు కౌంటర్స్ వేస్తాడు. ముకుంద గురించి ఆరా తీస్తాడు. ముకుందకు అసలు నచ్చదు.

ఈరోజు279 వ ఎపిసోడ్ లో ప్రభాకర్ మధు తో కలిసి తాగి, లోపలికి వెళ్దాం అనుకునే టయానికి భవానీ దేవి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ప్రభాకర్ మాట్లాడదాం అనుకుంటాడు. పైనుంచి ఇదంతా ముకుంద చూస్తూ ఉంటుంది. అక్క మరి గా మిలిటరీ కి వెళ్లిన నా పెద్దల్లుడు గిట్ల ఫోన్ చేస్తున్నాడా అని భవానీని అడుగుతాడు ప్రభాకర్. హా అవును శకుంతల ఏది అని మాట దాటేస్తుంది భవాని. పైన ఉన్నట్టుంది అని ప్రభాకర్ అంటాడు కొడుకు గురించి అడుగుతుంటే మాట దాటేస్తుంది ఏంటి ఈవిడ అని ప్రభాకర్ కి ఆలోచన వస్తుంది. ప్రభాకర్ ఏదో ఆలోచిస్తున్నాడని గమనించిన భవానీ దేవి ఏంటి ఆలోచిస్తున్నారు అని అంటుంది.

వినాయక చవితి హడావిడి..
భవానీ దేవి అలా అడిగేసరికి ప్రభాకర్ కూడా రేపు పండగ ఉంది కదా దాన్ని ఎలా ధూమ్ ధామ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెబుతాడు. నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని భవానీ దేవి ఫుల్ సపోర్ట్ చేస్తుంది ప్రభాకర్ ని, ఇదంతా పైనుంచి ముకుంద చూస్తూ ఉంటుంది అంతా చక్కగానే ఉంది కానీ ఈ ముకుందా సంగతే అర్థం కావట్లేదు ఏదో ఒకటి తేల్చాలి అని ప్రభాకర్ మనసులో అనుకుంటాడు.

అలేఖ్యతో గుడ్ న్యూస్ చెప్పిన మధు..
మధు ప్రభాకర్ తో మాట్లాడి రూమ్ లోకి వస్తాడు. అలేఖ్యతో నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. అలేఖ్య నేను కూడా మీకు ఆ విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటో చెప్పు అంటాడు మధు ఆ పెద్దపల్లి ప్రభాకరు బాబాయిని చూస్తుంటే నాకు భలే సరదాగా అనిపిస్తుంది అండి ఆయనతో మాట్లాడుతుంటే కామెడీగా ఉంటుంది. అని ప్రభాకర్ గురించి మాట్లాడుతుంటుంది అలేఖ్య నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటో అడగవా అని అంటాడు మధు ఏంటో చెప్పండి అంటుంది. ఆ పెద్దపల్లి ప్రభాకర్ నాతో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాడు అని చెప్తాడు మధు ఒకసారిగా అలేఖ్య పెద్దగా అరుస్తుంది కంగ్రాట్స్ అండి ఇక మీకు తిరుగు ఉండదు అని అంటుంది. కానీ నీకు ఒక విషయం చెప్పాలి అని అంటే అలేఖ్య కోప్పడుతుంది వెంటనే మధు చెప్పాలన్న ఊపు ఉత్సాహం కూడా ఉండకుండా చేస్తావు నువ్వు. ఎందుకు కోప్పడతావో కూడా నాకు అసలు తెలియదు అనిమధు అంటాడు.
Krishna Mukunda Murari: ముకుంద కి ట్విస్టుల మీద ట్విస్టులు.. మురారి కి వార్నింగ్..

కృష్ణతో ముకుంద గొడవ..
కృష్ణ వెతుక్కుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి ముకుంద వచ్చి ఎవరికోసం వెతుకుతున్నావని అంటుంది నీకు తెలియదా అని అంటుంది.మురారి కోసం వెతుకుతున్నావా అని అంటే, పిచ్చి ముకుందా మురారి ఒకసారి కోసం ఎందుకు వెతుకుతాను గుండె కోసం ఎవరైనా వెతుక్కుంటారా అని అంటుంది. అయితే అత్తయ్య కోసం వెతుకుతున్నావా అని అంటుంది కాదు అంటుంది కృష్ణ నా కళ్ళ కోసం వెతుకుతారా, మా అత్తయ్య నా కళ్ళతో సమానం అన్నట్టుగా చెప్తుంది మీ తొట్టి గ్యాంగ్ కోసం వెతుకుతున్నావా అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారు వెళ్లి వెతుక్కో అంటుంది. ముకుంద నీకు చాలా సార్లు చెప్పాను మళ్లీ చెప్తున్నాను నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టాలని మాట్లాడకు అని అంటుంది. తొట్టి గ్యాంగ్ ని తొట్టి గ్యాంగ్ కనుక ఏమంటారు అని అంటుంది ముకుంద. అయినా పెద్ద కోడలుగా ఉన్న నీటిని చిన్న కోడలు అయిన నేను ఏమన్నా అంటే బాగోదు కృష్ణ కావాలని,నన్నేదో పెద్ద కోడి లాగా చూపిద్దాం అనుకుంటున్నావా అది ఏప్పటికి జరగదు అని అంటుంది. జరుగుతుంది ముకుందా జరిగేలాగా చేస్తాను అని అంటుంది. నేను ఉండేదంతా సమాజం కోసమే, సమాజమే చూసుకుంటుంది అయితే అని అంటుంది కృష్ణ సమాజం ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వమంటుంది అందుకే నేను పట్టించుకోను అని ముకుందా అంటే అలా అయితే నిన్ను మంచిగా ఎవరూ గుర్తించరు అని అంటుంది కృష్ణ ఏం అవసరం లేదు నన్ను ప్రేమించిన వాడి గుర్తిస్తే చాలు అని ముకుంద కౌంటర్ ఇస్తుంది. కృష్ణ ఏదో ఆలోచనలో పడితే షాక్ అయ్యావా అంటుంది ముకుంద లేదు జాలి పడుతున్నాను నీ మాటలకు బెదిరిపోయి నీకు సడన్రైపోవడానికి నేను అలేఖ్యని కాదు అని అంటుంది కృష్ణ. నీకు మళ్ళీ చెప్తున్నాను ముకుందా నాతో కానీ, మురారితో గాని నువ్వు పెట్టుకోకు ఎందుకంటే మా ఇద్దరి మధ్యలోకి వస్తే నేను ఊరుకోను అని అంటుంది. చాల్లే కృష్ణ వెళ్లి మీ తొట్టి గ్యాంగులతో అమ్మలక్కల ముచ్చట్లు చెప్పుకోపో అని అంటుంది నాకేం సమస్య లేదు అని అంటుంది ముకుంద మీ నాన్న అని నేను ఎంతో గౌరవంగా మాట్లాడుతాను. నువ్వు మా వాళ్ళని అలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని అంటుంది కృష్ణ. పాలముకునే వాళ్ళు చేపల ముక్కునే వాళ్ళు సైకిల్ మీద తిరిగేవాళ్లు అని ముకుందా నానా మాటలు అంటూ ఉంటే కృష్ణకి కోపం వచ్చి ఒక్కసారిగా ముకుందా అని పెద్దగా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ముకుందా ఎలాగైనా వినాయకుడి పూజకి వెళ్లేటప్పుడు ఇద్దరూ కలిసి వెళ్లకుండా చేయాలి అని అనుకుంటుంది.

శకుంతల మీద కోపడిన ముకుంద..
ముకుంద తో శకుంతల మాట్లాడదామని వస్తుంది మీ ఆయన మిలిటరీలో పని చేస్తున్నారు కదా మిలిటరీలో చేయడం అంటే అల్లుడుగారు చాలా గొప్పవాడు. ఎంత మంచి మనసు అనేది అలాంటి వాడిని పెళ్లి చేసుకున్నావు తొందరగా ఎవరూ అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోరు కానీ నువ్వు చేసుకున్నావంటే నువ్వు చాలా గొప్ప దానివి అయినా అల్లుడుగారు సంవత్సరానికి ఒకసారి అయినా వస్తారా రేపొద్దున అల్లుడుగారు పోతే అందరితో పాటు దేశం కూడా గర్విస్తుంది అలాంటి వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు అని శకుంతల ఆదర్శ గురించే మాట్లాడుతూ ఉంటుంది.ముకుందా అవన్నీ భరించలేక ఒకసారి గా పెద్దగా అరుస్తుంది శకుంతల మీద. అదంతా ప్రభాకర్ గమనిస్తూ ఉంటాడు. వెంటనే ముకుందా అరిచినా అరుపుకి కృష్ణ మురారి మధు అందరూ వస్తారు. కృష్ణ ముకుందా ఏం మాట్లాడుతున్నావ్ అని అంటుంది. నీకేమన్నా పిచ్చా ఇంటికి వచ్చిన బంధువులతో ఇలాగేనా మాట్లాడేది అని అంటుంది. వాళ్లు నీకు బంధువులు నాకు కాదు అని అంటుంది. మీరు అసలేం మాట్లాడమాకండి మీరు నాకు బంధువులు కాదు అని అంటుంది. ముకుంద దిస్ ఇస్ టూ మచ్ అంటాడు మురారి. లిమిట్స్ దాటితే ఇలానే ఉంటుంది మురారి అంటుంది ముకుంద. ఆవిడ పది మాటలు మాట్లాడితే నేను ఒక్క మాట మాట్లాడుతున్నాను అంటే నాతో మాట్లాడకుండా పక్కకు వెళ్లాలి కదా అయినా సోది చెప్పుకుంటూ ఇక్కడే ఉంటే ఇలానే మాట్లాడాల్సి వస్తుంది అని అంటుంది. కృష్ణ మా పిన్నికి సారీ చెప్పు అని అంటుంది అడ్డమైన వాళ్ళకి సారీ చెప్పడం నాకు ఇష్టం ఉండదు అని అంటుంది ఇక నీ క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి అని అంటుంది కృష్ణ వెంటనే ముకుందా కృష్ణ అని పెద్దగా అరుస్తుంది. మురారి సరిది చెప్పి అక్కడినుంచి కృష్ణుని తీసుకొని వెళ్తాడు.

ముకుందంటే ఇష్టమని చెప్పినా అలేఖ్య..
నీకు ఫోన్ తప్ప ప్రపంచం తెలీదా అని అంటాడు మధు ఏమైంది అని అడుగుతుంది ఆ ముకుందా మరీ ఎక్కువ చేస్తుంది అని అంటాడు. ఇప్పుడు ఏం చేసిందని అని అంటుంది అలేఖ్య. అయినా ముకుంద ఏం చేసినా నాకు ఇష్టమేనండి తను అంటే నాకు ఇష్టం అని అంటుంది నిన్ను ఆ ముకుందని మార్చలేమే. అయినా ముఖం అడుగుతుంది ఏమైనా చెట్టు మీద పండు చాక్లెట్, అడగంగానే ఇవ్వడానికి అయినా ముకుంద ఇప్పుడు కృష్ణ వాళ్ళ పిన్నితో గొడవ పడింది. అయితే మీరెల్లి ఆపలేకపోయారా అంటుంది అలేఖ్య మధు నాకా ఛాన్స్ కృష్ణ ఎందుకు ఇస్తుంది తనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది ముకుంద కి అని అంటాడు. అయినా ముకుందా చేసేవి అసలేం బాలేవు అని అంటాడు మధు నువ్వు ఎప్పుడూ ముకుంద చుట్టూనే తిరుగుతుంటావు కదా నువ్వైనా చెప్పు తనకి అని అంటాడు మీరు ఎప్పుడు కృష్ణ చుట్టే తిరుగుతూ ఉంటారు కదా మీరు కూడా అర్థమయ్యేలా చెప్పండి కృష్ణకి తన ఏదో సరదా పడుతుంది అని అంటుంది. అయినా అవతలి వాళ్ళు సంసారం చూసే ముందు మనది కూడా చూసుకోవాలి అని అంటుంది అలేఖ్య. మధు వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి పడుకుంటాడు

ఆదర్శ్ ఆచూకీ..
కృష్ణ మురారి ఇద్దరూ కలిసి వినాయకుడి పూజకి వినాయకుడిని తీసుకురావడానికి వెళ్దాం అని అనుకుంటారు. అలానే బయటే టిఫిన్ కూడా చేయాలి అని అనుకొని పొద్దున్నే కిందకు వచ్చి భవాని దేవితో చెప్పి వెళ్దాం అని వస్తూ ఉంటారు భవానీ దేవి కృష్ణతో ఇప్పుడు మీరిద్దరూ కలిసి బయటికి వెళ్లడం కుదరదు మురారి కి పనుంది అని అంటుంది. ఈ ముకుంద ఏమన్నా మధ్యలో దూరి అత్తయ్య చేత ఇలా చెప్పిస్తుందా అని అనుమాన పడుతుంది కృష్ణ. ముందు అసలు పని ఏంటో చూద్దాము అని అనుకుంటుంది ఏంటి అత్తయ్య అని అడుగుతుంది.భవానీ దేవి మురారితో ఆదర్శ్ గురించి సైనిక్పురి లో ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు నువ్వు అక్కడికి వెళ్ళు అని అంటుంది. నన్ను కూడా రమ్మన్నారు కానీ ఇంట్లో గెస్ట్లు ఉన్నారు కదా నేను వస్తే బాగోదు నువ్వు వెళ్లి ఆ డీటెయిల్స్ తీసుకొని రా అని అంటుంది.కృష్ణ వెళ్దామని అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ తింగరి పిల్ల ఇంట్లో మీ వాళ్ళని పెట్టుకొని నువ్వు ఇక్కడే ఉండు తను వెళ్లొస్తాడు అని ఆపుతుంది.

రేపటి ఎపిసోడ్లో ప్రభాకర్ వినాయకుడిని తీసుకొని బాండలి ముగించుకుంటూ ఇంటికి తీసుకువస్తాడు. ఈరోజు పండగ కదా ధూంధాం చేద్దామనుకుంటున్నాను అంటాడు ప్రభాకర్ భవానీ దేవి సరే అంటుంది ఇక ప్రభాకర్ ముకుందతో అందరూ ఉన్నారు కదా మా పూజకి మీ నాన్న లేరు కదా మీ నాన్నని పిలువు అని అంటాడు. నేను అస్సలు పిలవను అని అంటుంది ముకుంద కోపంగా నీ చాటే పిలిచేలా చేస్తాను అని అందరి ముందు అంటుంది కృష్ణ.