టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ను యంగ్ బ్యూటీ కృతి శెట్టి మందేద్దాం రమ్మంది. అయితే రియల్‌గా కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `ది వారియర్`. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇందులో ఆది పినిశెట్టి విలన్‌గా నటించగా.. నదియా, అక్షర గౌడ కీలక పాత్రలను పోషించారు. జూలై 14న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనను దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ ను రాబడుతోంది. ఇందులో రామ్ డాక్టర్‌గానూ, పోలీస్ ఆఫీసర్‌గానూ అదరగొట్టేశాడు.
తన మార్క్ ఎనెర్జీతో రెండు పాత్రలకి పూర్తి న్యాయం చేశాడు. అలాగే విజిల్ మహాలక్ష్మిగా రేడియో జాకీ పాత్రలో కృతి శెట్టి సైతం బాగానే అలరించింది. అయితే ప్రమోషన్స్‌తో భాగంగా మేకర్స్ సినిమాకు సంబంధించి ఓ ప్రోమో వీడియోను బటయకు వదిలారు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇంతకీ వీడియో ఏముందంటే.. కృతి ‘బయటకు వెళ్దామా’ అని అడుగగా.. దానికి రామ్ నవ్వుతూ ‘ఎక్కడికి కాఫీ షాప్కేనా’ అంటాడు. అంతలో కృతిశెట్టి ‘ఏ అమ్మాయిలు అడిగితే కాఫీ షాప్కేనా.. మందేద్దామా’ అనడంతో రామ్ షాక్ అవుతాడు. చివర్లో `ఓసి దీని దుంప తెగ` అంటూ నదియా డైలాగ్ వదలడం ఆకట్టుకుంది. మొత్తానికి పది సెకెండ్ల నడివి ఉన్న ఈ వీడియో అదిరిపోయిందని చెప్పాలి.
Satya & Whistle Mahalakshmi's Onscreen Magical Chemistry is Pure Bliss 🤩❤️
🎟️https://t.co/dyBF2uJuVF
🎟️https://t.co/gt9CFtPDzo#WarriorrRampage #TheWarriorr ❤️🔥@ramsayz @AadhiOfficial @dirlingusamy @ThisisDSP @IamKrithiShetty @SS_Screens @adityamusic @masterpieceoffl pic.twitter.com/EPof96Bv62— Srinivasaa Silver Screen (@SS_Screens) July 17, 2022