యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసింది. `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ పట్టాలెక్కనుంది.
నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇకపోతే ఈ సినిమాను ప్రకటించి చాలా కాలమే అయినా ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఈ విషయంలో అభిమానులు ఎంతగానో నిరాశ చెందుతున్నారు. అయితే అభిమానుల నిరాశకు తెర దించుతూ ఎన్టీఆర్ 30 షూటింగ్ నవంబర్ 12 నుంచి ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దాని ప్రకారం.. ఈ సినిమా మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగుతుందట. ఓ సంపన్నుడి చివరి క్షణాలు ధీన పరిస్థితుల్లో ఎలా ముగిసింది అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందట.
అలాగే కార్పొరేట్ వైద్యం పేదల పాలిట అందని ద్రాక్షలా ఎందుకు మారింది..? అందుకు గల కారణాలు ఏంటి..? అన్న విషయాలను కొరటాల లోతుగా చూపించబోతున్నాడట. మనసుకు హత్తుకుని ఎమోషన్ తో పాటు అదిరిపోయే మెసేజ్ కూడా ఈ సినిమా ద్వారా ఇవ్వబోతున్నారని.. ఇందులో ఎన్టీఆర్ ను మున్నెప్పుడు కనిపించిన డిఫరెంట్ రోల్ లో చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజము అన్నది తెలియాల్సి ఉంది.