Intinti Ramayanam OTT Release: తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా, నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న తెలుగు ఫిల్మ్ ‘ఇంటింటి రామాయణం’ సినిమాని కొనేసింది. సురేష్ నరెడ్ల డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాని డిసెంబర్ 16న రిలీజ్ చేస్తోంది. ఇంటింటి రామాయణం సినిమాలో సీనియర్ నటుడు నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి తదితరులు నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే విషయాలను కొత్తగా ఫన్నీగా చూపించనుందని సమాచారం.
Intinti Ramayanam OTT Release: అసలు కథ ఏంటి

ఈ సినిమా కరీంనగర్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తుంది. అక్కడ గ్రామంలో ఉండే రాములు(నరేష్ ), అతని పక్కింట్లో ఉండే మరో కుటుంబ సభ్యులు ఒక సమస్యను ఎదుర్కొంటారు. ఆ సమస్య వారిలో ఒకరిపై ఒకరికి కొత్త అనుమానానికి తెర లేపుతుంది. ఆ సమయంలో వారిలో ఎలాంటి ఎమోషన్స్ వస్తాయి? ఆ సమస్యలు వారి కుటుంబ సభ్యుల పై ఎలాంటి ప్రభావని చూపిస్తాయి? అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాని మారుతీ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ కచ్చితంగా ఆకట్టుకుంటుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
వన్‌స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్
ఇప్పటికే ఆహాలో ఎన్నో మంచి సినిమాలు ఉన్నాయి. ఇపుడు ఇంటింటి రామాయణం సినిమా కూడా వాటిలో చేరిపోయింది. కలర్ ఫోటో, భీమ్లా నాయక్, డిజె టిల్లు, క్రాక్ లాంటి మంచి చిత్రాలతో పాటు అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకె సీజన్ 2, డ్యాన్స్ ఐకాన్, తెలుగు ఇండియన్ ఐడల్ స్పెషల్ షోస్, అన్యాస్ ట్యూటరియల్స్, గీత సుబ్రహ్మణ్యం, లెవంత్ అవర్ లాంటి వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయడం కోసం కొత్త ప్రోగ్రామ్స్ ను తీసుకురావడానికి ఆహా ఎప్పుడూ తన శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటుంది.