NewsOrbit
Entertainment News OTT సినిమా

Ponniyin Selvan 2: అప్పుడే నెల కాకముందే “పొన్నియన్ సెల్వన్ 2” ఓటీటీలో రిలీజ్..!!

Share

Ponniyin Selvan 2: దక్షిణాది చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో ఒకరైన మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన “పొన్నియన్ సెల్వన్ 2” ఏప్రిల్ 28వ తారీకు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేటర్ లో విడుదల ఈ నెలరోజులు కాకముందే ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతుంది. ప్రైమ్ సభ్యత్వంతో సంబంధం లేకుండా 399/- రూపాయలు చెల్లించి ఎవరైనా “పొన్నియన్ సెల్వన్ 2” చూడవచ్చు. ఒక్కసారి అద్దె చెల్లించి సినిమా చూడటం స్టార్ట్ చేసిన తర్వాత 48 గంటల్లో పూర్తి చేయాలి. మిగిలిన షరతులు వర్తిస్తాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నప్పటికీ “పొన్నియన్ సెల్వన్ 2” ఉచితంగా చూడటానికి ఏమాత్రం అవకాశం లేదు. డబ్బులు చెల్లించి చూడాల్సిందే.

Ponniyan Selvan 2 will be released in OTT before a month

ఈ క్రమంలో క్యాష్ బ్యాక్ రూపంలో ₹100 వెనక్కి ఆఫర్ కూడా పెట్టడం జరిగింది. ఏకంగా చూసుకుంటే 299/- రూపాయలు పెట్టి సినిమా చూడొచ్చు. అయితే ఇంత డబ్బు పెట్టిన… కేవలం 48 గంటల్లో మాత్రమే ఆ డబ్బు సద్వినియోగం చేసుకోవాలి. ఆ తర్వాత లింకు పనిచేయదు. మళ్లీ చూడాలంటే మళ్ళీ డబ్బులు చెల్లించాల్సిందే. కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కించారు. విక్రం, ఐశ్వర్యారాయ్, కార్తీ, జయం రవి, త్రిష వంటి స్టార్ నటీనటులు ఇందులో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తమిళంలో కాస్త కూసో ఆడిన ఈ సినిమా మిగతా భాషల్లో డిజాస్టర్ గా నిలిచింది.

Ponniyan Selvan 2 will be released in OTT before a month

ఒక జూన్ నెల రెండో వారం నుంచి అమెజాన్ సబ్ స్క్రైబర్ లకు ఉచితంగా “పొన్నియన్ సెల్వన్ 2″ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ₹300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించటం జరిగింది. స్టోరీ చూసుకుంటే చాలా యువరాజు..పొన్నియన్ సెల్వన్.. తన పైకి వచ్చిన శత్రుముకులతో పోరాడుతూ సముద్రంలో మునిగిపోవడంతో తొలిభాగం స్టోరీ ముగుస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు  ఆపద వచ్చిన కాపాడే ఓ వృద్ధురాలు ఈసారి అతని కోసం సముద్రంలో ప్రత్యక్షమవుతుంది. నందిని పోలికలతో కనిపించే వృద్ధురాలు ఎవరు..? ఆ యువరాజుని ఎలా కాపాడింది..? ఈ రకంగా..”పొన్నియన్ సెల్వన్ 2” రెండో విభాగం స్టోరీ ఉంటుంది. అసలు తొమ్మిదవ శతకంలో చాలా సామ్రాజ్యంలో ఏం జరిగిందనేది స్టోరీ.


Share

Related posts

Paagal : పాగల్ – నివేత రొమాంటిక్ సాంగ్ అదుర్స్..

bharani jella

NTR 30: ఎన్టీఆర్ తో తలబడబోతున్న సైఫ్ అలీ ఖాన్..!!

sekhar

Hamsa Nandini cute saree photos

Gallery Desk