Pelli SandaD OTT Release: సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `పెళ్లి సందడి` చిత్రంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఎంతటి సంచలనం విజయం సాధించిందో తెలిసిందే. ఈ హిట్ మూవీకి సీక్వెల్‌గా ఇటీవల `పెళ్లి సందD`ని రూపొందించారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించగా.. కన్నడ సోయగం శ్రీలీల హీరోయిన్‌గా పరిచయం అయింది.
రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, ప్రగతి తదితరులు కీలక పాత్రలను పోషించారు. రాఘవేంద్రరావు కూడా ఈ మూవీతో నటుడిగా మారి రోషన్‌కు తాత పాత్రను పోషించారు.
భారీ అంచనాల నడుమ గత ఏడాది అక్టోబర్‌లో ఈ మూవీ విడుదల అయింది. కథ అంత అద్భుతంగా ఏమీ లేకపోయినా… రాఘవేంద్ర రావు స్టైల్ లో విజువల్స్ కనిపిస్తాయి. శ్రీలీల సినిమాకు ఓ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టి హిట్‌గా నిలిచింది.
అయితే ఈ మూవీ బాక్సాఫీస్ రన్ ముగిసినా ఓటీటీలోకి రాలేదు. అప్పుడు, ఇప్పుడు అంటూ వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. ఇక ఎట్టకేలకు ఈ మూవీని మేకర్స్ ఓటీటీలోకి దింపుతున్నారు. `పెల్లి సందD చేయడానికి రెడీనా?? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్, అందరూ ఆహ్వానితులే` అంటూ జీ5 వారు తాజాగా ట్వీట్ చేశారు. దీంతో జీ5లో జూన్ 24న ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని స్పష్టమైంది.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…