శివ కార్తికేయన్.. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈయన నుంచి వచ్చిన సీమ రాజా, రేమో, వరుణ్ డాక్టర్, డాన్ వంటి చిత్రాలు తమిళం తో పాటు తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే శివ కార్తికేయనుకు ఇక్కడ స్పెషల్ మార్కెట్ ఏర్పడింది.
దీంతో ఆయన నటించిన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. అయితే ఈసారి శివ కార్తికేయన్ నేరుగా తెలుగులో ఓ సినిమా చేశాడు. అదే `ప్రిన్స్`. `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తుంది. సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా `ప్రిన్స్` ట్రైలర్‌ను బయటకు వదిలారు. ఈ ట్రైలర్ ఆధ్యంతం కామెడీ సాగుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక భారతీయ కుర్రాడు, బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించడం వల్ల ఎలా సమస్యలు ఎదురయ్యాయి అనే కథాంశంతో రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీని రూపొందించారు.
`ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే దాన్ని నేను సరిగ్గా పాటించాను. అందుకే బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించాను` అంటూ శివ కార్తికేయన్ చెప్పే డైలాగ్ ట్రైలర్ లో హైలెట్‌గా నిలిచింది. అలాగే ఆయన తన కామెడీ టైమింగ్‌తో క్యారెక్టర్ లో అదరగొట్టాడు. టైలర్‌లో ప్రతి సీన్‌ను వినోదాత్మంగా తీశారు. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అంతేకాదు, ట్రైలర్ ను చూసిన సినీ ప్రియులు శివ కార్తికేయన్‌కు మరో హిట్ ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.