బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `లెజెండ్` వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత `పండగ చేస్కో`, `షేర్`, `సైజ్ జీరో`, `డిక్టేటర్`, `రూలర్` చిత్రాల్లో నటించింది. అలాగే రీసెంట్ గా విడుదలైన `ఎఫ్ 3` మూవీలోనూ మెరిసింది.
అయితే ఇవేమీ సోనాల్ కు ఇక్కడ స్టార్ హోదాను అందించలేకపోయారు. ప్రస్తుతం ఈ అమ్మడి ఆశలన్నీ `ది ఘోస్ట్` పైనే ఉన్నాయి. అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. దసరా పండుగ కానుకగా నేడు ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఈ సినిమాతో మంచి హిట్ అందుకుని ఇక్కడ వరుస ఆఫర్లు అందుకోవాలని సోనాల్ ఆరాటపడుతోంది. ఇకపోతే సోనాల్ చౌహాన్ తాజా ఫొటో షూట్ నెట్టింట వైరల్ గా మారింది. చెన్నైలో జరిగిన `ది ఘోస్ట్` ప్రమోషనల్ ఈవెంట్ లో దగదగలాడే సిల్వర్ కలర్ ఫ్రాక్ ధరించి హాట్ థైస్‌తో దడదడలాడించింది.
అలాగే ఇదే డ్రెస్‌లో ఫోటోషూట్ చేసిన సోనాల్.. అందుకు సంబంధించిన పిక్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ పిక్స్ నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తూ నెట్టింట క్షణాల్లో వైరల్ అయ్యాయి. మొత్తానికి సోనాల్ అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అంతేకాదు ఆమె తాజాగా పిక్స్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు.