NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Allu Arjun: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అల్లు అర్జున్ గురించి అభిమానుల‌కు కూడా తెలియ‌ని టాప్ సీక్రెట్స్ ఇవే!

Allu Arjun: నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సినీ తారలు సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ గురించి అభిమానులకు కూడా తెలియని కొన్ని టాప్ సీక్రెట్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1982 ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు చెన్నైలో రెండో కుమారుడుగా అల్లు అర్జున్ జన్మించాడు. మెగాస్టార్ చిరంజీవి యొక్క విజేత సినిమాతో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటికి అతని వయసు ఎంతో తెలుసా.. కేవలం మూడేళ్లు. మెగా ఫ్యామిలీలో అతి చిన్న వయసులోనే కెమెరాను ఫేస్ చేసిన హీరో అల్లు అర్జున్.

అలాగే స్కూలింగ్ డేస్ లో ఉన్నప్పుడే అల్లు అర్జున్ జిమ్నాస్టిక్స్ మ‌రియు పియానో వాయించడం నేర్చుకున్నాడు. చిన్నతనం నుంచి డాన్స్ అంటే అల్లు అర్జున్ కు అమితమైన ఆసక్తి. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అల్లు అర్జున్ కచ్చితంగా పర్ఫార్మ్ చేసేవాడు. టీనేజ్ లోకి వచ్చిన తర్వాత హీరో కావాలని అల్లు అర్జున్ భావించాడు. మొదట అందుకు తల్లి నిర్మల అంగీకరించకపోయినా.. ఆ త‌ర్వాత కుమారుడి కోరికను కాదనలేకపోయారు. 2003లో అల్లు అర్జున్ ను దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు గంగోత్రి మూవీతో హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఈ సినిమా విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. లుక్స్ ప‌రంగా అల్లు అర్జున్ చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. అలా అని వెన‌క్కి త‌గ్గ‌లేదు. విమ‌ర్శించిన వారి చేత స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు.

ఆర్య మూవీతో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్‌.. దేశముదురు చిత్రంతో మాస్‌ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. పరుగు, జులాయి, రేసుగుర్రం, సరైనోడు, అలా వైకుంఠపురంలో వంటి చిత్రాలు అల్లు అర్జున్ ను టాలీవుడ్ టాప్ హీరోల చేత కూర్చోబెట్టాయి. 2022లో వచ్చిన పుష్ప ది రైస్ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు.

అలాగే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారాన్ని సొంతం చేసుకున్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్. దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం ఉన్న మొదటి టాలీవుడ్ హీరో మరియు తొలి సౌత్ ఇండియన్ యాక్టర్ కూడా అల్లు అర్జునే. ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పరంగానూ అల్లు అర్జునే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. తనదైన స్టైల్, ఆటిట్యూడ్, డాన్సులతో దేశవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న అల్లు అర్జున్ కు.. ఇన్‌స్టాలో ఏకంగా 25 మిల‌య‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

అలాగే అల్లు అర్జున్ కు ఐశ్వర్యారాయ్ అంటే విపరీతమైన అభిమానం. ఆమెకు పెళ్లైనప్పుడు తను చాలా బాధపడ్డాన‌ని అల్లు అర్జున్ గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపాడు. టైటానిక్‌ మరియు ఇంద్ర అల్లు అర్జున్ హోస్ట్ ఫేవ‌రెట్ మూవీస్‌. ఈ రెండు చిత్రాలను ఆయన లెక్కలేనన్ని సార్లు చూశార‌ట‌. అల్లు అర్జున్ గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. టాలీవుడ్ కు సిక్స్ ప్యాక్ పరిచయం చేసిన తొలి నటుడు ఆయ‌నే. దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్‌తో క‌నిపించాడు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబుతో స‌హా మ‌రికొంద‌రు హీరోలు అల్లు అర్జున్ ను ఫాలో అయ్యారు.

సుదీర్ఘ సినీ ప్రయాణంలో పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా అల్లు అర్జున్ చేసిన చిత్రం రుద్రమదేవి. ఇందులో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టేసాడు. అల్లు అర్జున్ గురించి చాలామందికి తెలియని మరో విషయం ఏంటంటే.. ఆయన ఒక పుస్తకాల పురుగు. బుక్స్ చదవడం అంటే అల్లు అర్జున్ కు ఎంతో ఇష్టం. ఇక నటుడిగా సక్సెస్ కాకపోతే అల్లు అర్జున్ యానిమేషన్ రంగంలోకి అడుగు పెట్టాలని భావించారట. అందుకే యానిమేషన్ కూడా నేర్చుకున్నాడు.

Related posts

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu