Python video : సాధారణంగా మనకు ఎక్కడైనా పాము కనిపించిందంటే గట్టిగా కేకలు వేస్తూ ఆమడ దూరం పారిపోతాము. పాములు అంటే ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. పాములలో ఎన్నో రకాల పాములు ఉంటాయి. వాటిలో కొన్ని ఎంతో విషపూరితమైనవి. ఇక పాములలో అతి పెద్దదైన కొండచిలువల చేతికి దొరికితే ఇక మన ప్రాణాల పై ఆశలు వదులుకోవాల్సిందే. మనకన్నా ఎంతో ఎత్తు, బలంగా ఉన్న ఈ కొండ చిలువలు మనల్ని తినేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే.అలాంటి కొన్ని పదుల సంఖ్యలో ఉన్న కొండచిలువల మధ్య ఓ వ్యక్తి సావాసం చేస్తున్నాడంటే ఊహించుకోవడానికి ఎంతో భయంకరంగా ఉంది. ఆ కొండచిలువలు మధ్య ఉంటూ ఏ మాత్రం భయపడకుండా ఎంతో ఆనందంగా వాటి గురించి వివరిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పదుల సంఖ్యలో వివిధ రకాల సైజులలో, రంగులలో ఉన్న అనకొండల మధ్య ఓ జంతు సంరక్షకుడు ఉండి వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ క్రమంలోని కొన్ని అనకొండలు అతని పై పడిన అతని ఏ మాత్రం భయపడకుండా వాటి గురించి వివరిస్తూ ఉన్న ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. అన్ని పాములు అతనిపై పడినప్పటికీ అతను ఎంతో ఆనందంగా, నవ్వుతూ ఎలాంటి భయం లేకుండా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ భయంకరమైన వీడియోను అక్వాలేడీ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియో పోస్ట్ చేయడమే కాకుండా, ఈ వీడియోకు సంబంధించి”50 మిలియన్ల డాలర్ల కోసమైనా ఒక గంట ఉండగలరా…”అంటూ క్యాప్షన్ పెట్టి ఈ వీడియో పోస్ట్ చేశారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. విషం లేని పాముల మధ్య ఎవరైనా ఉంటారని, నేను కూడా ఇలాంటి పాముల మధ్య ఉండగలను కేవలం కలలో మాత్రమే అంటూ కామెంట్లు పెట్టగా, ఎటువంటి డాలర్లు తీసుకోకుండా నేను ఉండగలనా అంటూ మరికొందరు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/Aqualady6666/status/1356859859782815745?s=20